May be Justice Sadshivam will the New Governor for the telugu states

May be justice sadshivam will the new governor for the telugu states

Governor, AP, Telaangana, narasimhan, justice Sadashivam, Jerala Governor

May be Justice Sadshivam will the New Governor for the telugu states. Governor Narasimhan very disappointed on telugu states cms.

తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా జస్టిస్ సదాశివం

Posted: 09/08/2015 09:59 AM IST
May be justice sadshivam will the new governor for the telugu states

తెలంగాణ, ఏపి రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తన పదవి నుండి తప్పుకోవాలని చూస్తున్నట్లు చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా గవర్నర్ పదవిని అలంకరించే వారి జాబితాలో కొత్త పేరు తెర మీదకు వచ్చింది. నజ్మా హెప్తుల్లా, కృష్ణంరాజు లాంటి వార్ల పేర్లు తాత్కాలికంగా తెర మీదకు వచ్చినా కానీ అవి నిజం కాదని తేలిపోయింది. రాష్ట్ర విభజనకు ముందు నుండి కూడా గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ ను తొలగించి వెంటనే కొత్త వ్యక్తిని గవర్నర్ పోస్ట్ లో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కానీ గత కొంత కాలం క్రితం జరిగిన పరిణామాలు, గవర్నర్ సనసింహన్ కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుకు విసిగిపోయారని తెలుస్తోంది. అందుకే తాను స్వచ్ఛందంగా గవర్నర్ గిరిని వదులుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్థానంలో మరొకరిని నియమించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినా రాకపోవడంతో.. మనస్తాపం చెంది బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఆయన కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఒకవైపు నరసింహన్ అన్ని అంశాల్లో తెలంగాణ వైపు మొగ్గుచూపుతున్నారని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తూ పదేపదే గవర్నర్‌ను మార్చాలని పట్టుబడుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ పరిష్కారం కావాలని, ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరాలని కేంద్రం భావిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు న్యాయ నిపుణులైన వారిని గవర్నర్‌గా నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేరళ గవర్నర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.

*Abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  AP  Telaangana  narasimhan  justice Sadashivam  Jerala Governor  

Other Articles