TDP government twists over Pawan Kalyan demand

Minister narayana accepts and twists pawan kalyan s demand

TDP government, Pawan Kalyan demand, Narayana accepts and twists Pawan Kalyan's demand, Pawan Kalyan Tweets about Land Aquisition act and TDP's Decision, Pawan Kalyan Latest Tweets, Pawan Kalyan Tweets, Pawan Kalyan Tweets against Govt aquiring lands from farmers in capital region, janasena party, Pawan Kalyan, AP government, land acquisition plan, farmers land, capital amaravathi region

TDP government minister narayan accepts janasena party president Pawan Kalyan demand and twists over it again

పవన్ వ్యాఖ్యాలపై మెలిక పెట్టిన టీడీపీ అమాత్యులు

Posted: 08/14/2015 01:04 PM IST
Minister narayana accepts and twists pawan kalyan s demand

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంత రైతుల రైతుల భూములను భూ సేకరణ చట్టం కింద సేకరించేందుకు తాను వ్యతిరేకినని ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని మరోమారు వెల్లడించిన నేపత్యంలో టీడీపీ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా ఈ వ్యవహారాలను చక్కబెడుతున్న మంత్రి నారాయణ పవన్ కల్యాన్ వ్యాఖ్యలను సమ్మతిస్తునే.. మెలిక పెట్టారు. విద్యావేత్తగా అపార అనుభవం సంపాదించిన ఆయన రాజకీయాలలో అడుగుపెట్టి పెట్టగానే వరించిన మంత్రి పదవితో.. ఏకంగా అపార అనుభవం వున్న రాజకీయ వేత్తగా మారిపోయారు.

అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చేందుకు అంగీకరించని రైతులపై భూసేకరణ చట్టం అమలు చేయవద్దని పవన్ మరో మారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరారు. రాజధానికి భూములు అవసరమని ప్రభుత్వం భావిస్తున్నస్పటికీ.. వారిపై భూ సేకరణ చట్టం అమలుపర్చకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధానికి మిగిలిన భూములను సేకరించేందుకు యజమానుల సమస్యల్ని పరిష్కరించి.. సామరస్య వాతావరణంలోనే తీసుకోవాలని విన్నవించారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ  ఏ రైతును ఇబ్బంది పెట్టకుండా తాము భూసేకరణ చేస్తున్నామని చెబుతూనే మెలిక పెట్టారు.

ఈ నెల 20వ తేదీలోగా ల్యాండ్ పూలింగ్‌కు రైతులు మందుకు రావాలని, అలా వచ్చిన వారి భూములపై భూసేకరణ చట్టం అమలుపర్చబోమని సూచించారు. ఇప్పటి వరకు రైతులు అంగీకారంతో ల్యాండ్ పూలింగ్ పూర్తయిందని చెప్పిన ఆయన, ఈ నెల 20లోగా రైతులు ముందుకు రావాలని అలా రాని వారి భూములపై భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తాము ఏ రైతులను ఇబ్బంది పెట్టమని చెబుతూనే మెలిక పెట్టడం టీడీపీ రాజకీయ నేతలకు అలవాటే. పవన్ కల్యాన్ చెప్పిన దానికి బిన్నంగా వ్యవహరిస్తామని చెప్పకనే మంత్రి నారాయణ చెప్పేశారు. ఇక అమరావతి నిర్మాణం కోసం ఇప్పటి వరకు 34వేల ఎకరాలను సేకరించామని చెప్పారు. మరో 2,200 ఎకరాలు అవసమని తెలిపారు. రాజధాని ప్రకటన తర్వాత భూమి ధర భారీగా పెరిగిందన్నారు. ఇరవై రెట్లకు పైగా పెరిగిందని చెప్పారు. గతంలో భూమి ధర రూ.పది లక్షలకు వరకు ఉండేదని, ఇప్పుడు కోటి నుంచి రెండు కోట్ల వరకు పలుకుతుందని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles