In an opposition-less Lok Sabha, Sushma Swaraj refutes all charges in Lalit Modi row.

Sushma swaraj speaks on lalit modi row uninterrupted as opp continues boycott

sushma swaraj, lalit modi, lok sabha, congress, sumitra mahajan, parliament live, lok sabha live, lalit modi controversy, venkaiah naidu, lalit gate, parliament, Narendra modi

After days of protests and sloganeering by the opposition, Foreign Minister Sushma Swaraj spoke at length on the allegations made against her in the controversy surrounding former IPL boss Lalit Modi.

చిన్నమ్మ ఎదురుదాడికి కారణం అదేనా..?

Posted: 08/09/2015 03:29 PM IST
Sushma swaraj speaks on lalit modi row uninterrupted as opp continues boycott

తెలుగు ప్రజలకు చిన్నమ్మగా సుపరిచితురాలైన బిజేపి సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్.. పార్లమెంటులో విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను, మీడియాలో వచ్చిన కథనాలను.. కేవలం కల్పితంగా కోట్టిపారేశారు. తాను తప్పు చేశానని ఎవరైనా అధారాలతో రుజువు చేస్తే.. అప్పుడు తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే సుష్మా ఎదురుదాడి చేయడం వెనుకు కారణం మాత్రం వేరే వుందన్న భావన కలుగుతోంది. పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారుగా సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం.. ఐక్యంగా లేకపోవడం అమెకు కలిసొస్తోందని రాజకీయ నాయకులు విశ్లేషణ. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యుల సస్పెన్షన్ తరువాత సీన్ మారింది. కాగా విపక్షాలన్నీ పార్లమెంటు వెలుపల మాత్రం ఐక్యంగా ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నాయి.

పార్లమెంటు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా.. ఇన్నాళ్లు లలిత్ మోదీకి సహకరించారనే ఆరోపణలపై సుష్మ రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే.. ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం కలసిరావడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సభలో చర్చకు అనువైన వాతావరణం ఉంటే చాలని తెలిపింది. చర్చించకుండానే సుష్మ రాజీనామా కోరే విషయంపై తృణమూల్ వెనకడుగు వేసింది. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు నిరాకరించింది. అయితే ఇప్పుడు పరిస్థితిని మార్చుకున్న తృణముల్ కాంగ్రెస్.. తాము పార్లమెంటు సమావేశాలకు హాజరు కాము, వెతనాలను తీసుకోబోమని కూడా  ప్రకటించేసింది.

వామపక్షాలు కలిసివచ్చినా ఉభయ సభల్లో వారి బలం అంతంత మాత్రమే. 34 మంది ఎంపీలున్న తృణమూల్ కానీ, ఇతర రాజకీయ పార్టీలో కాని మద్దతివ్వకపోవడంతో కాంగ్రెస్‌ ఐక్య పోరాటం చేయలేకపోతోంది. కనీసం 20 మంది ఎంపీలున్న బిజూ జనతాదళ్‌ను కూడా కాంగ్రెస్ తమ ఆందోళనలో కలుపుకోలేకపోయింది. సరిగ్గా ఈ అనైక్యతే సుష్మకు, మోడీ సర్కారుకు కలిసివచ్చింది. ప్రతిపక్షాల అనైక్యతతో కాంగ్రెస్ ఆందోళన ఒంటరిపోరే అయింది.రాజీనామా విషయంలో విపక్షాల నుంచి ఎలాంటి ఒత్తిడీ లేకపోవడంతో సుష్మ రిలాక్స్‌డ్‌గా ఉన్నారు. అయితే ఈలోగా తొమ్మిది పార్టీల మద్దతు కూడగట్టిన కాంగ్రెస్.. తమ ఎంపీల ఐదు రోజుల సస్పెన్షన్ తరువాత పార్లమెంటులో తీవ్రస్థాయిలో ఆందోళనను చేపట్టవచ్చని కూడా విశ్లేషకులు భావన.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushma swaraj  venkaiah naidu  lalit gate  parliament  

Other Articles