Amaravathi | AP | Chandrababu naidu | New Dist in ap | New Capital

Ap govt likely to announce amaravathi as 13th dist

Amaravathi, AP, Chandrababu naidu, New Dist in ap, New Capital

Ap govt likely to announce amaravathi as 13th dist. Ap govt moving the file of amaravathi to announce the new capital city amaravathi as new dist.

అమరావతి.. ఓ రాజధానే కాదు జిల్లా కూడా..?!

Posted: 07/21/2015 06:44 PM IST
Ap govt likely to announce amaravathi as 13th dist

రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ప్రాంతం మొత్తాన్ని ఒక జిల్లాగా రూపొందించేందుకు ప్రభుత్వ స్థాయిలో భారీ కసరత్తు జరుగుతోందని సమాచారం. రాజధాని నిర్మాణం పూర్తయిన తరువాత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేపట్టి అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు తొలిదశలో రాజధాని పరిధిలో తొమ్మిది శాఖల జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కార్మిక, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, నైపుణ్య కార్పొరేషన్‌, మెప్మా, పోలీసుశాఖ, లీడ్‌ బ్యాంకు, పంచాయతీరాజ్‌, గ్రామీణ ఆభివృద్ధి శాఖల ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్‌ కృష్ణారావు గత నెలలోనే ఉత్తర్వులు కూడా జారీ చేశారని సమాచారం. రాజధాని నగర యూనిట్లతో జిల్లా స్థాయి కార్యాలయాలను అనుసంధానం చేస్తారు.

amaravati-city-image-02

కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌, డిఎంహెచ్‌వో, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా రిజిస్ట్రార్‌, ఉపాధి, శిక్షణ మిషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌, జిల్లా ఎస్‌పి, లీడ్‌ బ్యాంకు మేనేజరు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ, డ్వామా పిడి తదితర కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సుంది. దీంతోపాటు వీటికి అధికారులనూ, సిబ్బందినీ వెంటనే నియమించాలని నిర్ణయించారట. వీరంతా గుంటూరు జిల్లా కలెక్టర్‌ అధీనంలో పనిచేయాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణంలోనూ ఈ శాఖలు కీలక భూమిక పోషించనున్నాయి. ఆయా శాఖల పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని రాజధాని నగర జిల్లా కార్యాలయాల్లో వెంటనే నియమించాలని కోరినట్లు సమాచారం. పోస్టుల భర్తీ కోసం వేచి చూడొద్దని, ఉన్నవారినే అక్కడికి పంపి సర్దుబాటు చేసి తక్షణం నియామకాలు చేపట్టి కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తొమ్మిది శాఖల అధికారులకు సూచించారు. వీటితోపాటు దశలవారీగా అన్ని శాఖల జిల్లా కార్యాలయాలనూ ఏర్పాటవుతాయని భావిస్తున్నారు.

amaravati-city-image-03

జిల్లాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరగవచ్చు. ఇందులో భాగంగా 58 మండలాలు, రెండు కార్పొరేషన్లు, మరో 10 మున్సిపాల్టీలు కలిపి ఒకపెద్ద జిల్లాగా క్రిడా పరిధి ఉంటుంది. రాజధాని పేరునే కొత్త జిల్లానూ కొనసాగించే అవకాశముంది. అమరావతి జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతి పాదనల నేపథ్యంలోనే తొలిదశలో ముఖ్యమైన 9 జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల అమరావతి కేంద్రంగా జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటుపై సిఎం చంద్రబాబు హైదరాబాద్‌లో సమీక్షించారు. 29 గ్రామాల పరిధిలో రిజిస్ట్రేషన్లు ఈ జిల్లా కార్యాలయం ద్వారానే జరగాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravathi  AP  Chandrababu naidu  New Dist in ap  New Capital  

Other Articles