Telangana Govt trying to conduct the GHMC elections in february

Telangana govt trying to conduct the ghmc elections in february

GHMC, Elections, Telangana, Hyderabad, TRS, MIM, Greater elections

Telangana Govt trying to conduct the GHMC elections in February. TRS party hope that till February party will get more vote bank in the GHMC.

ఫిబ్రవరిలో జిహెచ్ఎంసీ ఎన్నికలా..?

Posted: 07/21/2015 01:56 PM IST
Telangana govt trying to conduct the ghmc elections in february

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల మూడవ వారంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈలోపు  హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే వివిధ నియోజక వర్గాల్లో 15 లక్షలకు పైగా ఉన్న బోగస్‌ ఓటర్లను ఏరివేయాలని సంకల్పించింది. ఇదే సమయంలో జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌ చివరిలోపు రిజర్వేషన్లపై ఒక అంగీకారానికి రావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

మేయర్‌ ఎన్నికను ప్రత్యక్షంగా లేక పరోక్షంగా జరపాలన్న ప్రతిపాదనపై సుధీర్ఘంగా చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మేయర్‌ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి అధికారాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీఎం చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజధాని హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేయడంతోపాటు మేయర్‌ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకు నేందుకు వీలుగా పావులు కదుపుతున్నట్టు సమాచారం.

రాష్ట్ర ఎన్నికల సంఘానికి చైర్మన్‌గా నియమితులైన  రిటైడ్ ఐఏఎస్‌ అధికారి నాగిరెడ్డి జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలు దఫాలు సీఎం కేసీఆర్‌తో మంతనాలు జరిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టుకు ఇప్పటికే లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడం జరిగిందని ఆగస్టు నెలలో ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన విషయాన్ని నాగిరెడ్డి చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గుర్తు చేసినట్టు సమాచారం. అయితే వార్డుల పునర్విభజన, బోగస్‌ ఓటర్ల ఏరివేత, కొత్త ఓటర్ల నమోదులాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తున్నందున మరోసారి ఈ ఎన్నికల నిర్వహణకు హైకోర్టును సమయం కోరాలని కేసీఆర్‌ ఎన్నికల సంఘాన్ని కోరినట్టు ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద మీనమేషాలు లెక్కిస్తోంది. ఇప్పటికే హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా. పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. తెలంగాణ సర్కార్ ఎలాగైనా హైదరాబాద్ లో టిఆర్ఎస్ జెండా పాతాలన్న సంకల్పం ఎన్నికలను మరింత ముందుకు నెడుతున్నాయి. అయితే ఎన్నికలు ఎప్పుడో ముగించాల్సి ఉన్నా రాజకీయ కారణాల వల్ల ఇలా ఆలస్యం ఛెయ్యడం ఏంటని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కనీసం ఫిబ్రివరిలో ఎన్నికలు నిర్వహిస్తే గెలుపు ఖాయమని అనుకుంటున్న టిఆర్ఎస్ కల తీరుతుందో లేదా కళ్లగా మిగులుతుందో చూడాలి.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  Elections  Telangana  Hyderabad  TRS  MIM  Greater elections  

Other Articles