Jr. NTR conspicuous by his absence at Mahanadu

Why jr n t r avoid tdp mahanadu 2015

Jr. N.T.R. avoid TDP Mahanadu 2015, jr ntr forgotten or avioded, Actor Jr. NTR, Junior. NTR, TDP Mahanadu 2015, TDP election campaign, HariKrishna, Actor Balakrishna, Nara Lokesh, Chandrababu naidu, TDP,. Telangana TDP, Andhra Pradesh TDP president, R Krishnaiah, Yerrabelli, Motkupalli, Mahanadu, nannapaneni rajakumari,

Actor Jr. NTR was conspicuous by his absence at the Mahanadu, which will end today. He, however, was seen at his grandfather's memorial yesterday, offering tributes

జూనియర్ ఎన్టీయార్ ను మరిచారా..? విస్మరించారా..?

Posted: 05/29/2015 10:26 PM IST
Why jr n t r avoid tdp mahanadu 2015

తెలుగుదేశం పార్టీ.. తెలుగువారి ఆత్మభిమానం ఢిల్లీ విధుల్లో తాకట్టు కాకూడదని పుట్టిన పార్టీ. ఆంద్రుల అభిమాన నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ. అప్పటి వరకు ఓటు హక్కు, దాని వినియోగం.. హక్కును వినియోగించు కోవాల్సిన  అవసరం ఎందుకు..? అని తెలియని బడుగు, బలహీన వర్గాల ప్రజలతో పాటు దళిత, గిరిజన, మైనారిటీలకు తెలియజేసిన పార్టీ. అయితే కాల గమనంలో అన్న ఎన్టీరామారావు పరమపదించిన తరువాత.. ఇప్పటి వరకు పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు కానీ.. ఎన్టీయార్ ను పోలిన నాయకులు మాత్రం ఆ పార్టీలో లేరనే చెప్పుకోవాలి.

అయితే కాలక్రమేనా తెరపైకి వచ్చింది, వినిపించిన పేరు మాత్రం జూనియర్ ఎన్టీయార్. అన్నగారి పార్టీ ఎన్నికల రధసారధిగా పార్టీకి ముందుండి నడిపించన హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీయార్. ఆయనను చూడగానే అబ్బా.. బుల్లోడు.. అచ్చం అన్నగారిలాగే వున్నాడనుకున్నారు అన్నగారి అభిమానులు. తాతను మించిన మనవడు అవుతాడని ఆశీర్వదించారు మరికోందరు. అయితే సినిమాలకే తప్ప.. రాజకీయాలకు ఏనాడు విలువనీయని జూనియర్ ఎన్టీయార్ ను రాజకీయ చట్రంలోకి లాగింది మాత్రం ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే.

వ్యవసాయం దండగన్న విమర్శలు, విద్యుత్ బిల్లులపై బషీర్ బాగ్ కాల్పులు మరోవైపు, రైతులు ఆత్మహత్యలు, రాష్ట్రంలో కరువు విలయతాండవం వెరసి ప్రజలు టీడీపీ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేసిన సమయంలో..  అన్ని పార్టీలను కలుపుకుని సమరాంగనంలోకి దూకిన కాంగ్రెస్.. చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతం పాడింది. అప్పుడప్పుడే ప్రాంతీయ వాదంతో సెంటిమెంటును కలగలపుకుని పురుడుపోసుకున్న టీఆర్ఎస్ సహా పలు పార్టీలు కాంగ్రెస్ తో జతకట్టాయి. వైఎస్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం టీడీపీని మరింతగా టార్గెట్ చేసింది.

ఐదేళ్లు గడిచాయి. చంద్రబాబు.. అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డుతూనే వున్నారు. అయినా మదిలో ఏదో తెలియని భయం. అధికారంలోకి వస్తామా..? లేదా..? అన్న అందోళన. అదే సమయంలో ప్రముఖ నటుడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించారు. అదే ఒక దెబ్బ అనుకున్న తరుణంలో సందెట్లో సడేమియా అన్నట్లు అవినీతి వ్యతిరేక ఉద్యమం  పేరుతో పురుడు పోసుకున్న ఐఎఎస్ అధికారి జయప్రకాష్ నారాయణన్ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. అన్ని ఇలా ప్రజల్లోకి బలంగా వెళ్తున్న తరుణంలో.. ఆయనకు కనబడిన ఒకే ఒక వెలుగు జూనియర్ ఎన్టీయార్.

నిజానికి తెలుగుదేశం పార్టీకి వారుసులుగా వుండాల్సిన నందమూరి వారిని పక్కకు జరిపి నారా వారు పార్టీని హైజాక్ చేసుకున్నా..అవన్నీ పక్కనబెట్టిన జూనియర్ ఎన్టీయార్.. చంద్రబాబు పిలవగానే లగెత్తుకెళ్లి ప్రచారానికి సిద్దమయ్యారు. అప్పుడెప్పుడే 1983లో ఎన్టీయార్ పార్టీని స్థాపించిన తరువాత చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమం తరహాలోనే.. జూనియర్ కూడా శ్రీకాకుళం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించాడు. అచ్చం తాత తరహాలో కార్మికుడి వేషాధరణతో.. అన్నగారే మళ్లి వచ్చారా..? అన్న ప్రసంగ వాద్గాటి.. డైలాగులు.. ఎన్టీయార్ మళ్లీ పుట్టాడన్నట్లుగా వున్నాయి.

ఎక్కడ చూసినా ప్రజల సాదరస్వాగతాలు.. డైలాగ్ ముగిసేంతలోపే కరతళధ్వనులు.. పసివాళ్ల దెగ్గర్నించి.. పండు ముసలి వరకు అందరూ జూనియర్ ఎన్టీయార్ ప్రసంగాలకు మంత్రముగ్దులయ్యారు. కాదు ఆయనే వారిని సమ్మోహనులను చేశాడు. చివరకు ప్రసంగాన్ని ముగించుకుని వస్తున్న క్రమంలో ప్రమాదానికి గురై.. ఆ తరువాత ఎన్నికల ప్రచారం కోసం తన అనారోగ్యాన్ని కూడా లేక్కచేయకుండా అస్పత్రి బెడ్ మీద నుంచి మీడియాతో మాట్లాడటం, టీడీపీకే ఓటు వేయాలని ప్రజలను కోరుతూ వీడియో సందేశాలను ఇవ్వడం కూడా చేశాడు.  సరిగ్గా ఆరున్నళ్ల క్రితం పార్టీకి ఇంతలా ఉపయోగపడిన జూనియర్ ఎణ్టీఆర్ ను తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి ఆహ్వానించడం మర్చిపోయిందా..? లేక విస్మరించిందా..? అన్నది పార్టీ అధినేతకే తెలియాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr. N.T.R  Chandrababu  Nara Lokesh  TDP Mahanadu 2015  

Other Articles