Chandrababu Not Consider Pawan kalyan during Mahanadu.

Pavan kalayan not considered during mahanadu by chandrababu

pavan kalayan not considered during mahanadu by chandrababu, chandrababu naidu, mahanadu programme, tdp party updates, chandrababu naidu controversies, elections promises, chandrababu elections promises, ap capital city news, ap capital donations, ap capital updates, ap capital amaravati plan, tdp mahanadu, mahanadu 2015, NTR, balakrishna, pavan Kalyan, power star pavan kalyan, PK, nara lokesh, hari krishna, Jr NTR,

chandra babu not in a stage to spell about pavan kalyan in mahanadu, the person behind bringing TDP into power.

తెప్ప తగలేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యా..?

Posted: 05/28/2015 09:45 PM IST
Pavan kalayan not considered during mahanadu by chandrababu

రేవు దాటేవరకు ఓడ రామన్న, దాటగానే బోడ రామన్న అన్నట్లు వ్యవహరించడం టీడీపీ అధినేత, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శలు వినిపిస్తున్నాయి. 1980 దశకంలో యావత్ దేశంలో మైనే ప్యార్ కియా సినిమా గాలి నడుస్తుండగా, అప్పటి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం శివ చిత్రం సంచలనాన్ని రేకెత్తించింది. సరిగ్గా అలానే గత ఏడాదిన్నర క్రితం దేశవ్యాప్తంగా మోడీ మానియాతో నమో మంత్రంతో ఊగిపోగా, నవ్యాంధ్రలో మాత్రం పవనిజం అంటూ రాష్ట్ర ప్రజలు తన్మయత్వంలో ఊగిపోయారు.

సరిగ్గా అలాంటి వాతావరణాన్ని క్యాష్ చేసుకునేందుకు, తెలంగాణ ఏర్పడటానికి తన లేఖే  కారణమంటూనే.. అప్పటి కాంగ్రెస్ పాలకులను దోషులుగా చేస్తూ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా సాగిందని ఆరోపణలు గుప్పిస్తూ.. అటు వైసీపీపై విమర్శలను గుప్పిస్తూ.. రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. బీజేపితో పోత్తు చారిత్రక తప్పిదమన్న చంద్రబాబు.. మళ్లీ అదే పార్టీతో పోత్తు పెట్టుకుని.. మోదీతో మ్యానియాను కూడా తనకు కలసివచ్చేలా చేసుకున్నారు.

ఈ తరుణంలో తెరమీదకు వచ్చిన జనసేనకు ఎన్నికల కమీషన్ గుర్తింపు లభించకపోవడంతో.. బీజేపి విధివిధానాలు నచ్చి..ఆ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కల్యాన్ వద్దకు వచ్చి.. అర్థించి, వేడుకుని, ఇతర నేతలచేత సిఫార్సు చేసుకుని తమ పార్టీకి కూడా అనుకూలంగా ప్రచారం చేయమని కోరిన చంద్రబాబు.. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం తమకు మేలు చేసే వారిని విస్మరించారు. ఎన్నికల ప్రచార సమయంలో పవన్ పేరుతో ఓట్లు రాలుతున్నాయన్న నిజాన్ని తెలుసుకున్న చంద్రబాబు.. తాను ఒంటరిగా ప్రచారం చేసిన పలు సభల్లోనూ పవన్ కల్యాన్ పేరును ఉపయోగించుకున్నారు. సాక్షాత్తు మోడీ ప్రసంగించిన సభలో ఆయనతో పాటు చంద్రబాబు కూడా పవన్ ను ఆకాశానికి లేవనెత్తిన విషయం తెలిసిందే.

మాట ఇచ్చిన తరువాత వెనక్కు తీసుకోవడం తెలియని పవన్.. తాను నిర్వహించిన ప్రచార సభల్లో బీజేపి, టీడీపీలకు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. తన అభిమానులకు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. పవనిజంతో రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టించిన అయన అభిమానులు.. జనసేన మద్దతుదారులు ఆయన మాటలకు విలువనిచ్చి.. టీడీపీకి నూతన సైనికుల్లా వ్యవహరించి.. పార్టీ గెలుపుకు కారణమయ్యారు. ఆసుపత్రి బెడ్ పై పేషంట్ లా వున్న టీడీపీకి అక్సిజన్ గా మారి నూతన జవసత్వాలను కల్పించిన పవన్ ఏడాదిలోనే మరిచారు చంద్రబాబు. పదేళ్లు ప్రతిపక్షంలో వున్న టీడీపీని ఎన్నికల సమయంలో ప్రజలు నిజంగా విశ్వసించారా..? అంటే లేదనే చెప్పాలి. అసలు టీడీపీ అధికారంలోకి వచ్చి వుండేదే కాదని చెప్పాలి. అది సుసాధ్యం చేసింది పవన్ కల్యాన్ మాత్రమే. పవన్ లాంటి ఒక గొప్ప శక్తి టీడీపీకి మద్దుతునిచ్చినా కేవలం ఐదారు లక్షల ఓట్ల తేడాతోనే టీడీపీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.

కాగా, ఆదరించిన వారిని దూరం చేసుకోవడం.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శలు ఇప్పటికే వినబడుతున్నాయి. అన్నగారు స్వర్గీయ ఎన్టీరామారావు నుంచి పార్టీ బాద్యతలను సంక్రమించుకున్న తరువాత చంద్రబాబు ముందుగా తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఆ తరువాత హరికృష్ణ, ఆ తరువాత జూనియర్ ఎన్టీయార్ ఇలా కుటింబికులను దూరం చేసుకున్నాడన్న టాక్ వినబడుతుంది. అటు నేషనల్ ఫ్రంట్ తో దోస్తి తరువాత బిజేపితో దోస్తి చేసుకుని కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు.. ఆ తరువాత బీజేపితో దోస్తి చారిత్రక తప్పిదమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇప్పడు మోడీ మానియాను ఉపయోగించుకునేందుకు దోస్తీ అంటూ జతకట్టారన్న విమర్శలు కూడా షికార్లు చేస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  mahanadu  pavan Kalyan  election promises  

Other Articles