TDP plans to weaken TRS by encouraging schism!

Telangana tdp leader revanth on minister harish rao

Telangana tdp leader revanth on minister harish rao, revanth reddy on Harish rao, Telangana tdp leader revanth reddy, TDP plans to weaken TRS by encouraging schism, minister harish rao, KT ramarao, telangana chief minister KCR

Telangana tdp leader revanth reddy plans to weaken TRS by encouraging schism

నారద మహర్షిని మించిపోతున్నారు..

Posted: 05/05/2015 06:30 PM IST
Telangana tdp leader revanth on minister harish rao

తెలంగాణ టీడీపీలో యువకిశోరంగా, మంచి వాగ్ధాటి వున్న నేతగా అనతికాలంలోనే పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పడిన నాయకడు, ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకోచ్చే పనిలో వున్నారు. ఇందుకోసం ఆయన నారద మహర్షి అవతారం ఎత్తారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన హరీష్ రావును టార్గెట్ గా చేసుకుని, చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన నారద మహర్షిని కూడా చిపోయారని విమర్శలకులు అంటున్నారు.

లోక కళ్యాణంలో కోసం నారదుడు కలహాలను పెడితే.. రేవంత్ మాత్రం తన పార్టీ పూర్వ వైభవం కోసం కలహాలు పెడుతున్నారు. అదీనూ హైదరాబాద్ సాక్షిగా జరిగిన ప్లీనరీలో హరీష్ రావు జాడ కనబడకపోవడం.. ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో.. ఇక హరీష్ టార్గెట్ చేస్తే బాగుంటుందని, ఆయనను ఎలాగోల పార్టీ నుంచి పంపితే.. టీఆర్ఎస్ పార్టీలో చీలిక రావడం ఖాయమని భావించిన రేవంత్ ఈ చర్యలకు పూనుకుంటున్నాడట. తెలంగాణలోని మెదక్ జిల్లా పర్యటన సందర్భంగా హరీష్ కత్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యలను అన్వయించి.. కత్తి కాదు చుర కత్తి అంటూ రేవంత్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను వెన్నుపోటు పోడిచేందుకు అది సిద్దమైందని కూడా వ్యాఖ్యానించారు రేవంత్.
తాజాగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనే టీఆర్ఎస్ పార్టీని చీల్చి కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హారీశ్ రావు సిద్ధమయ్యారని, దానికి ఈటెల రాజేందర్ సాక్ష్యమని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు హరీశ్ రావు సిద్ధమైతే టీడీపీ మద్ధతు ఇవ్వాలా, లేదా అనే దానిపై పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా రేవంత్ వ్యాఖ్యలను మాత్రం టీఆర్ఎస్ నేతలు కానీ, హరీష్ రావు కానీ, ఆయన వర్గీయులు కానీ మౌనంగా వున్నారు. కాగా కోందురు మాత్రం వెన్నుపోటు రాజకీయాలు మీ అధినేత నుంచే నేర్చుకోవాలి.. ఎన్టీయార్ ను పదవీచ్యుతిడిని చేసి అధికారంలోకి వచ్చింది మీ నాయకుడే కదా అంటూ విమర్శిస్తున్నారు. టీడీపీని మించిన వెన్నుపోటు పార్టీ కానీ, వెన్నుపోటు దారులు కానీ మరేఇతర పార్టీలో వుండరని విమర్శస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harish rao  revanth reddy  schism  

Other Articles