Ys jagan mohan reddy commenced a press meet with uninterruped lengthy speech

ys jagan, pressmeet, media, jagan, sakshi, assembly

ys jagan mohan reddy commenced a press meet with uninterruped lengthy speech. ysrcp leader ys jagan mohan reddy commence media meet a lotus pond . media presons got bore at that pressmeet.

జగన్ మాట్లాడుతున్నాడా.. పరుగెత్తండి బాబోయ్

Posted: 03/20/2015 03:25 PM IST
Ys jagan mohan reddy commenced a press meet with uninterruped lengthy speech

రాజకీయ  నాయకులు మైక్ దొరికితే ఇక రెచ్చిపోయి ఎంతసేపైనా మాట్లాడటం మామూలే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో కానీ మరెక్కడైనా మాట్లాడుతున్నాడంటే ఎవరినీ పట్టించుకోరు. ఎదుటి వ్యక్తులు తన ప్రసంగాన్ని విన్నా వినకున్నా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని మాత్రం ముగించరు. కానీ ఒకప్పుడు చంద్రబాబు ప్రసంగం అలా సాగేది కానీ ప్రస్తుతం మాత్రం కొంత మార్పు వచ్చింది. కానీ చంద్రబాబు వదిలేసిన స్టైల్ ను మరోనేత ఫాలో అవుతున్నారు. తాజాగా ఆ నేత మీడియా సమావేశాన్నినిర్వహించి ఏకంగా రెండున్నర గంటలు మాట్లాడటంతో మీడియా వారికి బాగా విసుగు పుట్టిందట. మరీ ఇంత సేపు మాట్లాడతారా అని సీనియర్ జర్నలిస్ట్ లు అనుకున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరో అనుకుంటున్నారా..

తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను కలిగిన, వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ తన మాటల తూటాలతో ఏపి అసెంబ్లీలో గందరగోళానికికారణమైన వైయస్ జగన్ గురించి ఈ ఉపోద్ఘాతం అంతా. ఇంతకీ విషయం ఏంటంటే తమ పార్టీ ఎమ్మెల్యేలను ఏపి అసెంబ్లీ స్పీకర్ సస్పండ్ చెయ్యడంపై జగన్ గుర్రుగా ఉన్నారు. సభకు హాజరుకాకుండా తన గెస్ట్ హౌజ్ లోటస్ పాండ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ను ఉద్దేశించి జగన్ ప్రసంగం సుదీర్ఘంగా మాట్లాడారు.శాసనసభలో బడ్జెట్ పై తనను మాట్లాడనివ్వలేదని స్పీకర్ కోడెలపై ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వచ్చేసిన జగన్ మీడియా ముందు తన అబిప్రాయాలను చెప్పారు. అయితే ఒక్క జగన్ స్వంత మీడియా సిబ్బంది తప్ప మిగిలిన ఏ మీడియా సిబ్బంది పెద్దగా జగన్ ప్రసంగంపై ఆసక్తి కనబరచలేదు.

ఏదో ఓ ఐదు నిమిషాలు లేదంటే ఓ పదిహేను నిమిషాలు అంటే పర్లేదు కానీ గంటలుగంటలు మాట్లాడతాననంటే ఎలా కుదురుతుందని మీడియా వారు అభిప్రాయపడుతున్నారు. అయితే పాపం జగన్ బాబుకు ఏపి అసెంబ్లీలో కలిగిన అసౌకర్యం ఏమో కానీ వచ్చిన మీడియా వారికి మాత్రం జగన్ ప్రసంగం విసుగుపుట్టించింది. జగన్ తాను ఏం చెప్పతలుచుకున్నాడో సూటిగా చెప్పాలని కోడెల శివప్రసాద్ అసెంబ్లీలో ఎన్నో సార్లు చెప్పారు. అయినా అతను మారకపోవడంతో మైక్ కట్ చెయ్యాల్సి వచ్చింది. అయితే సభలో తన మైక్ కట్ చేశారని ఏకంగా గంట కొద్ది మాట్లాడిన జగన్, మీడియా సమావేశంలోనూ మైక్ కట్ చేస్తే బాగుండేదని కొందరు సీనియర్ పాత్రికేయులు అనుకున్నారట. మొత్తానికి మీడియా వారిని విసిగించి..విసిగించి చివరకు మీడియా వారు సహానాన్ని కోల్పోయిన తరువాత గానీ జగన్ తన ప్రసంగానికి ముగింపు పలకలేదట. ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క మీడియా విలేఖరి కూడా ఆలస్యం చెయ్యకుండా పరుగులు తీశారట. ఇక ఛస్తే ఇలాంటి మీడియా సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయం కూడా తీసుకున్నారట.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  pressmeet  media  jagan  sakshi  assembly  

Other Articles