Telanagna cm kcr may face current shock

telanagana, kcr, govt, power cut, discums, electricity, gujarath, chaitisgarh, industries

telanagan chief minister k. chandrashekar rao may get shock in this summer season. the telanagana state have the power deifcit from begining. the cm kcr promise to the people top supply uninterupted power supply.

షాకే సాలిడ్ గా ఉంటుంది.. కెసిఆర్ కు కూడానా..?

Posted: 03/19/2015 02:08 PM IST
Telanagna cm kcr may face current shock

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బక్క పలుచని మనిషే అయినా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. కరెంట్ తీగ చూడడానికే సన్నగా ఉంటుంది కానీ షాకే సాలిడ్ గా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది. అదే డైలాగ్ కెసిఆర్ కు ఆపాదించారు కొందరు తెలంగాణ వాదులు. కెసిఆర్ చూడడానికి బక్కపల్చగా ఉన్నా.. షాక్ మాత్రం సాలిడ్ గానే ఉంటుందని ఆ మధ్య తెగ ప్రచారం కూడా జరిగింది. అయితే అది నిజమేనా అన్నట్లు కెసిఆర్ కూడా ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లారు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.

అయితే ఇదంతా గతం.. అప్పుడెప్పుడో జరిగింది. కానీ తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కెసిఆర్ కు కరెంట్ షాక్ తప్పదని ఓ పుకారు షికారు చేస్తోంది. అదేంటి గతంలో షాక్ ఇచ్చిన కెసిఆర్ కే షాకా అనుకుంటున్నారా.. ఇది మామూలు షాక్ కూడా కాదు చాలా సాలిడ్. ఇంతకీ ఆ సాలిడ్ షాక్ ఏంటి అనుకుంటున్నారా.. తెలంగాణలో విద్యుత్ కష్టాలు. చూస్తుండగానే వేసవి కాలం రాను వచ్చింది. ఉద్యమం ప్రారంభం కాక ముందు నుండి తెలంగాణకు విద్యుత్ కష్టాలు తప్పవని హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి,. అయితే తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ కోతలు ఉండవని కూడా కెసిఆర్ హామీ ఇచ్చారు.

కానీ తెలంగాణలో మాత్రం విద్యుత్ లోటు ఉందని అందరికి తెలుసు.. గుజరాత్ నుండి ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ ను కొనుగోలు చేసి కరెంట్ కష్టాలు లేకుండా చేస్తామని కెసిఆర్ అన్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్టీ వ్యవహారాలపై సమీక్ష నిర్వహిస్తున్నప్పుడు కరెంట్ కట్ అవడం కెసిఆర్ కు కరెంట్ పోటు తప్పదని సంకేతాలు పంపింది. కరెంట్ కష్టాలు లేకుండా చేస్తామని, పరిశ్రమలకు ఎలాంటి అవాంతరం కలగకుండా చూసుకుంటామని చెప్పిన తరువాత ఇలాంటి పరిణామవ చోటుచేసుకోవడం విశేషం. అయితే తెలంగాణ సిఎం కెసిఆర్ కు కూడా కరెంట్ షాక్ కుడుతుందని, దాని నుండి ఆయన తప్పించుకోలేరని కొందరు అప్పుడే చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమవుతుందో కొన్ని రోజుల్లో తేలుతుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  kcr  govt  power cut  discums  electricity  gujarath  chaitisgarh  industries  

Other Articles