Fulfilling election promises is worrisome to ap government

Fulfilling Election Promises is Worrisome to AP Government, election promises a major problem to chandrababu government, AndhraPradesh Government, chandrababu on election promises, YSR congress party, lone opposition in AP assembly, TDP, Election Promises, unemployed scholarship, Employment

YSR congress party a lone opposition in AP assembly targets chandrababu on election promises

ఇబ్బడిముబ్బడి హామీలే ఇబ్బందులు పెడుతున్నాయా..?

Posted: 03/11/2015 03:04 PM IST
Fulfilling election promises is worrisome to ap government

నవ్యాంధ్రలో అధికారంలోకి ఎలాగైనా రావాలని.. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే ప్రమాదముందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇబ్బడిముబ్బడి హామీలే ఆయన ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. రాష్ట్ర చరిత్రలో ఎవరికీ లేనటువంటి ఘనత చంద్రబాబు సోంతం. అదే వరుసగా తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించటం. అంతటి ఘనతను సాధించిన చంద్రబాబు.. ఇప్పుడెందుకు మీనమేషాలు లెక్కిస్తూ.. ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోంటున్నారు..? అంటే సమాధానం రాదు. అదే అప్పట్లో టీడీపీ చేసిన తప్పిదం.

నవ్యాంధ్ర పరిస్థితి తెలిసి కూడా ప్రజలకు అనేక ఎన్నికల వాగ్ధానాలను చేశారు. వాటిని తీర్చడానికి నిధులు లేక ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అసెంబ్లీ జరుగుతుందంటే.. జగన్ ను ఆయన పార్టీని ఇబ్బందులు పాలు చేయడానికి టీడీపీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు రెడీగా వుంటున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎలాగోలా ఎదుర్కుని మమ అనిపించుకున్నా.. ప్రజలు ఏమనుకుంటున్నారు.. వారికెలా సమాధానం చెప్పాలన్న ప్రశ్నకు ఆయనే బదులివ్వాల్సి వుంటుంది. ప్రజలు అన్ని గమనిస్తారు.. ఎప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటించాలో వాళ్లకి తెలుసు అని పూర్తిగా విశ్వసించే చంద్రబాబు.. ఈ విషయాన్ని మర్చిపోయారా..? లేక అప్పుడే ఈ గొడవ ఎందుకులే అనుకుంటున్నారా..? ఆయనకే తెలియాలి.

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కదానిపై శాసనసభలో ప్రతిపక్షం నిలదీస్తున్నా.. వాటిని అవినీతి అని, మరోకటని అప్పటికప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ కప్పదాటు వ్యవహారాలకు టీడీపీ తెర తీయాల్సి వస్తుంది. ఇంతకీ టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కనీసం ఐదేళ్ల కైనా పూర్తయ్యేనా అంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగ బృతి కింద నెలకు రెండువేల రూపాయలు, ఇంటికొకరి ఉద్యోగం ఎప్పటికి లభించేనని నవ్యాంధ్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP government  TDP  YSR congress  manifesto  

Other Articles