Another trs party in telangana

another TRS party in Telangana, another political party in Telangana, another party into telangana politics, telangana reddy samithi, venkat reddy hot comments, won't leave congress party says komatireddy venkatareddy, nalgonda mla komatireddy venkat reddy, venkatareddy trashes new party comments, comments of new party are made by revanth reddy, revanth reddy comments on new party, political Joint action commitee chairman kodandaram reddy, professor kodandaram

Reddy community leaders are planning to form a new Political party in the leadership of professor, Telangana JAC convener kodandaram named as Telangana Reddy samithi

తెలంగాణలో మరో కొత్త టీఆర్ఎస్ పార్టీ..?

Posted: 03/07/2015 01:46 PM IST
Another trs party in telangana

తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి పునాదులు ఏర్పడుతున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షలను ఎంపిక చేయడంలో రెండో పర్యాయం కూడా తప్పు చేసిందని... పీసీసీ అధ్యక్షుడికి సహకరించబోనని  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బహిరంగానే విమర్శలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ... ఫార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నారా..? అంటే కూడా జమేనన్న సంకేతాలు వస్తున్నాయి. మరి నూతనంగా ఏర్పాటు కానున్న రాజకీయ పార్టీకి పేరు కూడా ఖరారు చేశారా అంటే.. అది కూడా ఇంచుమించుగా అవుతున్నట్లు సమాచారం.

తెలంగాణలో అధికారంలో వున్న కేసీఆర్ ప్రభుత్వంలో తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత అందడం లేదని.. కాబట్టి తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లభించడంతో పాటు ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడంతో ప్రస్తుతం ఉన్న పార్టీలతో అయ్యే పని కాదని, ఈ నేపథ్యంలోనే నూతన పార్టీ స్థాపించాల్సిన అవసరంముందని వారు బావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రోజున ఒకరికోకరు తారసపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మద్య సాగిన అసక్తికరమైన చర్చ కూడా ఇందుకు పరోక్ష సంకేతాలను ఇస్తోంది.

తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ నాయకత్వాంలో కొత్త పార్టీని ఏర్పాటు చేసి.. కేసీఆర్ టీఆర్ ఎస్( తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీకి కోదండరామ్ టీఆర్ఎస్ ( తెలంగాణ రెడ్డి సమితి) తో చెక్ పెట్టాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఇద్దరు నేతలు చర్చించుకున్నారు కూడా. ఇందుకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటకు వెళ్లడానికి రెడీ అవుతున్నారట వెంకటరెడ్డి. అయితే విషయం మీడియా చెవిన పడగానే లేదు లేదు అలాంటిదేమీ లేదని మాట దాటవేస్తున్నారట. ఉత్తమ్ కుమార్ రెడ్డితో తనకు వ్యక్తిగత సమస్యలే కానీ రాజకీయ తగాదాలు లేవని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : komatireddy venkatareddy  revanth reddy  Kodanda rami reddy  new party  

Other Articles