Jagan not targets bjp with jail fear

Jagan, YS Jagan, YS Jagan Arrest, Jagan case, Ys jagan cases, YS Jagan on tdp, YS Jagan on bjp, Ysr congress updates, Ysr congress programmes, Latest Andhra news, Andhra Pradesh updates

Jagan not targets BJP with jail fear : Tdp Accusing YSR Congress leader YS Jagan that he is not daring to accuse bjp because of jail fever. Jagan have jail fever so that he not criticise on bjp government says tdp leaders

కమలంకు అనుకూలంగా ఫ్యాను గాలి

Posted: 01/17/2015 10:48 AM IST
Jagan not targets bjp with jail fear

ప్రతిపక్ష పార్టీ అంటే అధికార పక్షానికి అపోజిట్ అని కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వ పనులు, విధానాల్లో లోపాలు వెతికి విమర్శించటమే ప్రతిపక్ష ప్రధాన పని. ప్రజలకు ప్రభుత్వాలు న్యాయం చేసేలా ప్రతిపక్షం పోరాడుతుంది. అయితే వైసీపీ ఈ విషయంలో కాస్త డిఫరెంట్ గా వ్యవహరిస్తోంది. రాష్ఱ్టంలో అధికారంలో ఉన్న టీడీపీ పై బాగానే విరుచుకుపడుతుంది. ప్రభుత్వం ప్రారంభించే ప్రతి పథకంపై విమర్శలు చేస్తోంది. కానీ.., కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వాన్ని పళ్లెత్తి మాట కూడ అనటం లేదు. కేంద్రంలోని ప్రభుత్వానికి మిత్రపక్షంగా లేని ఈ పార్టీ ఎందుకు నోరు మెదపటం లేదో కొందరికి తెలియటం లేదు.

జగన్ కేవలం కేసుల భయంతోనే బీజేపీపై నోరు ఎత్తటం లేదని అధికార పక్ష నేతలు అంటున్నారు. గతంలో 16 నెలల పాటు జైలులో ఉండి వచ్చిన జగన్.., మరోసారి ఆ జీవితం కోరుకోవద్దనే ఉద్దేశ్యంతోనే బీజేపితో మంచిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విమర్శలు చేస్తే.., విచారణ మళ్లీ వేగవంతమై కేసుల ధర్యాప్తు పూర్తి చేసి జగన్ ను జైలుకు పంపే అవకాశం ఉంది. మరోసారి జైలుకు వెళ్ళేందుకు ఇష్టంలేని వైసీపీ అధినేత ఇలా కమలదళానికి అనుకూలంగా గాలి వీస్తుందని స్పష్టం అవుతుంది.

టీడీపీ నేతలు చేస్తున్న ఈ ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడే చెప్పలేము కానీ.., ఇది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయమే. పైగా గతంలో బీజేపి-వైసీపీ దోస్తికి సిద్ధపడిన నేపథ్యంలో తాజా సైలెన్స్ వెనక సునామీ లాంటి నిజమేంటో తెలియాలి. అటు తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఇక్కడ ఎందుకు ప్రభుత్వాన్ని విమర్శించటం లేదో అన్న అనుమానాలు కూడా కొందరికి ఉన్నాయి. వీటిని ఏ మాత్రం కొట్టి పారేయలేము. అలాగని నిరూపించటం కూడా కష్టం. ఏదయితేనేం రాజకీయం అంటే అవసర చదరంగం అని తెలుసుకున్న జగన్.., అవసరానికి తగ్గట్లు పార్టీని విమర్శించాలా లేక పొగడాలా డిసైడ్ అవుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan not  BJP  Andhra Pradesh  

Other Articles