నాకు పెళ్లెప్పుడవుతుంది బాబు..నాకు పిల్లయాడ దొరుకుంతుంది బాబు.. ఒక సినీ కవి అమ్మాయి కాపురం సినిమాకు పాట రాయటం జరిగింది. ఇప్పుడు అదే పాటను.. పెళ్లికానీ ప్రసాదులు అందరు పాడుకుంటున్నారు. అదీ తెలుగు రాష్ట్రంలోనే పెళ్లికానీ ప్రసాదులు పెరిగి పోతున్నారు. తెలంగాణలో మాత్రం కాదులేండి. పక్కనే ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ సిటీలో పెళ్లికానీ ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుంది. అదీ కూడా జాబ్ చేస్తున్న వారికే పెళ్లి కష్టాలు వచ్చాయి. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న పిల్లనిచ్చే నాధుడే లేకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉందని సిటీ అధికారులు అంటున్నారు.
విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో వందలాది మంది యువకులు కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి కన్యాదానం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పేరుకు గవర్నమెంటు సంస్థలో పనిచేస్తున్నా... పెళ్లి కావడం లేదెందుకని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.
కార్పొరేషన్ లో పనిచేసే సిబ్బంది జీతాలను సక్రమంగా అందుకోవడం లేదు. జీతాలివ్వాలంటూ వారు తరచుగా చేసే ధర్నాలు టీవీల్లో ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి చూపులకు వెళ్లిన యువకులకు ‘మ్యాచ్ ఫిక్స్’ కావడం లేదు. ‘జీతాలు సక్రమంగా రాని మీరు మా అమ్మాయిని ఎలా పోషిస్తారు?’ అని ఆడపిల్లల తండ్రులు అడిగే ప్రశ్నలకు వీరు సమాధానం చెప్పలేకపోతున్నారు.
విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్ లో పనిచేసే పెళ్లి కాని ప్రసాదుల గురించి ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీశారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని ఆయన ఏపీఎన్జీవోల అభినందన సభలో హామీ ఇచ్చారు. ఇప్పటికే బాబు గారికి అనేక సమస్యలు ఉన్నాయి వాటిల్లో పెళ్లికానీ ప్రసాదుల సమస్య ఒకటి గా భావించి .. న్యాయం చేస్తే.. పెళ్లి చేసుకోని హాయిగా ఉంటామని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ మీకే ఓటేసి గెలిపించుకుంటామని పెళ్లికానీ ప్రసాదులు చంద్రబాబుని వేడుకుంటున్నారు. ఇక చంద్రబాబు పెళ్లికానీ ప్రసాదుల సమస్యలను ఎలా తీర్చుతాడో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more