Telangana people fire on telangana bandh

telangana people fire on telangana bandh, telangana bandh, polavaram project, trs party, cpm party, trs leaders,

telangana people fire on telangana bandh

సారు..! రెండోబంద్ ఫలితం ఏమిటి?

Posted: 07/12/2014 02:41 PM IST
Telangana people fire on telangana bandh

సీఎం సారు.! ఇది రెండవ బంద్.. దీని వల్ల ఫలితం ఏమిటి? మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? అని తెలంగాణ ప్రజలు, విద్యార్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అడుగుతున్నారు. తెలంగాణ రాక ముందు ఉద్యమాలు, బంద్ లు చేయటం జరిగింది. వాటి ఫలితం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ మళ్లీ ఇప్పుడు బంద్ లు ఎందుకు? ఈ బంద్ వల్ల ఎవరికి లాభంట? ఎవరికి నష్టం? గప్పుడంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బంద్ లు చేస్తే ఫలితం వచ్చింది. గిప్పుడు మనరాష్ట్రం, మన ప్రభుత్వం, మన పత్రిక , మన ప్రజలు . బంద్ దేనికోసం అని హైదరాబాద్ లోని చదువుకున్న పోరగాళ్లు అడుగుతున్నారు.

అసలు మనకు పోలవరం తో లాభం ఏంటి? పోలవరం అనేది ఆంద్రోళ్లిది కదా ! మళ్లీ ఇప్పుడు గీ పోలవరం లొల్లి ఏంటి ? 1956లో తెలంగాణ ఆమోదంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదంతో ఆంద్రప్రదేశ్ ను, తెలంగాణలో విలీనం చేయటం జరిగింది. అప్పటికి భద్రాచలం డివిజన్ తూర్పు గోదావరి జిల్లాలోనే ఉందని మీరు చెప్పారు. ఆంద్రప్రదేశ్ గా ఏర్పాడిన మూడేళ్లకు అంటే 1959లో పరిపాలనా సౌలభ్యం అంటూ భద్రాచలం డివిజన్ ను ఖమ్మం జిల్లాలో కలిపిన విషయాన్ని మీరు తెలంగాణ ప్రజలకు చెప్పటం జరిగింది. మరీ గిప్పుడు ఈ లోల్లి ఏంటి? సారు..

పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నాడు తెలంగాణ రాష్ట్రంలో బంద్ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ, టీఆర్ఎస్, సీపీఎం బంద్‌కు పిలుపు ఇచ్చింది. అధికారంలో వున్న తెరాస పార్టీ కూడా ఈ బంద్‌ కి మద్దతు ఇవ్వడం విశేషం. కాంగ్రెస్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఇతర ప్రజాసంఘాలు బంద్‌కి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

people-fire-on-T-bandh

కెసిఆర్ ప్రభుత్వ వర్గం ముందు కేవలం ఖమ్మం వరకే బంద్ చేయాలని అనుకున్నారు. కానీ సీపీఎం తెలంగాణ బంద్ కి పిలుపివ్వడంతో తెరాస వర్గాలు కూడా సైఅంటూ చేతులు కలపడంతో పరిస్థితి జటిలమైంది. తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ ఈ బంద్ జరగడంలో కీలకంగా మారారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పూర్తిస్థాయి బంద్ నడుస్తుంది. అయితే సాక్షాత్తు అధికార తెరాసనే బంద్ లో పాల్గొనడం కరక్టేనా? అన్నది ఆలోచించాల్సిన అంశం.

ప్రస్తుతం బంద్ వ్యవహారంతో ఆర్టీసీ బస్సులతో సహా గవర్నమెంటు ఆఫీసులన్నీ మూతపడడంతో గవర్నమెంటు ఆదాయానికి గండి పడుతుంది. అసలే శనివారం కావడంతో చేసే అర్ధపూట కూడా అధికారులు ఇళ్ళకే పరిమితమయ్యారు. గతంలో కెసిఆర్ మరో రెండు రోజులలో ముఖ్యమంత్రి కాబోతున్న సమయంలోనే కేంద్రం పోలవరం ఆర్డినెన్స్ చేయడంతో కెసిఆర్ బంద్ కి పిలుపిచ్చాడు. 

అయినా కేంద్రం కెసిఆర్ ను లెక్కచేయక ఇప్పుడు సభలో ఆమోదం వేసేసింది. ఆర్డినెన్స్ కూడా ఆమోదం పొందిన తర్వాత వెళ్తే కోర్టుకు వెళ్ళాలి తప్ప ధర్నా, బందులతో ప్రయోజనం ఉండదు. మరి కెసిఆర్ తెలిసి తెలిసి తన ఖజానాకు తానే ఎందుకు బొక్క పెట్టుకుంటున్నారో అర్ధం కాని పరిస్థితి. బహుశా ఇంకా ఉద్యమం హ్యంగోవార్ నుండి బయటపడలేదేమో! ఏమైన రెండో బంద్ ఫలితం ఇంత దారుణంగా ఉంటుందని అందరికి అర్థమైంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles