Home minister rajnath singh warning to cm kcr

ajnath singh warning to cm kcr, ome home minister warning to cm kcr, Rajnath Singh Warns KCR, Polavaram fight, ap vs telangana, cm kcr.

home minister rajnath singh warning to cm kcr

ఏంటి? సిఎం కేసిఆర్ కు వార్నింగ్ ఇచ్చారా?

Posted: 07/12/2014 01:25 PM IST
Home minister rajnath singh warning to cm kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూకుడు కు కేంద్రం వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కేసిఆర్ కు వార్నింగ్ ఇచ్చారా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మద్య ఆరని మంటలు రగులుతున్నాయి. ఆంద్రోళ్లపై తెలంగాణ సర్కార్ ఢీ అంటే ఢీ అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్న విషయం తెలిసిందే.

అయితే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ పై తెలంగాణ సర్కార్ ఘోరంగా ఫైట్ చేసి అలసి పోయింది. ఇలాంటి సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్‌ మధ్య సంబంధాలను పోలవరం అంశం మరింతగా దెబ్బతీసిందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ ఎంపీలు ఎంతగా వ్యతిరేకించినప్పటికీ పోలవరంపై రాష్టప్రతి జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఎన్టీఏ ప్రభుత్వం లోక్‌సభలో ఏకపక్షంగా ఆమోదింపజేసుకోవడంపై కెసిఆర్‌ తీవ్ర ఆగ్రహంతో వున్నారు.

గతంలోనే పోలవరంపై రాష్టప్రతి జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ బంద్‌కు పిలుపు ఇవ్వడంతో పాటు ఏకంగా అసెంబ్లీలో సైతం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడం ద్వారా దీనిపై భవిష్యత్తులో జరిగే పరిణామాలను కెసిఆర్‌ స్పష్టం చేసినట్లయింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో కెసిఆర్‌ కేంద్ర ప్రభుత్వంతో నేరుగా ఢీకొనడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాల్లోని 211 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం కానున్నాయి.

పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3ని సైతం ఉల్లంఘించిందని ఆరోపిస్తున్న కెసిఆర్‌ అవసరమైతే పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని డిమాండ్‌ చేస్తున్న ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎంపీలతో కలసి కేంద్రానికి ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్‌కు రూపకల్పన చేసేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కేసిఆర్‌ తాజాగా అర్డినెన్స్‌కు లోక్‌సభలో ఆమోద ముద్ర లభించడంతో ఇకపై కేంద్రంతో ఆమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతోంది. దీని ద్వారా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తూ తమ రాష్ట్రానికి ద్రోహం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమనే స్పష్టమైన సంకేతాలను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కెసిఆర్‌ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే సీఎం కేసిఆర్ దూకుడు విషయంలో కేంద్ర హోంమంత్రి రాజనాత్ సింగ్ కల్పించుకోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో ఢీ కొంటే చాలా నష్టపోతావ్. తెలంగాన ప్రభుత్వానికి కేంద్రం అండ లేకపోతే సీఎంగా నెట్టు రాగలవా? అంటూ ముఖ్య మంత్రి కెసిఆర్ కు హోం మంత్రి రాజనాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు అంటున్నారు. రాజనాథ్ సింగ్ వార్నింగ్ తో సీఎం కేసిఆర్ మొత్తబడినట్లు గులాబీ వర్గాలు అంటున్నాయి. ఏమైన బిజేపి , టీఆర్ఎస్ ల మద్య భవిష్యత్తులో రాజకీయ కష్టాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles