Telangana employees in andhra government

telangana employees in andhra government, telangana employees option is andhra, telangana employees, kamal nath committee, telangana employement, andhra employees, ap cm chandrababu naidu, telangana government, andhra pradesh government

telangana employees in andhra government

ఆంధ్రలోనే పనిచేస్తాం: వీర తెలంగాణ వాదులు

Posted: 07/05/2014 04:25 PM IST
Telangana employees in andhra government

మేం తెలంగాణలోనే పని చేస్తాం..! ఆంధ్రనేతల కింద పని చేయలేం..!, వలసవాదులతో  మేము కష్టాలు పడలేం!! అని వీర తెలంగాణ వాదులు బల్ల గుద్ది, గొంతెత్తి . వారి స్వరం వినిపించిన విషయం అందరికి తెలిసిందే. అయితే  ఇప్పుడు  ఆ పరిస్థితి మారిపోయింది. మేము  వీర తెలంగాణ వాదులమే. అయినా  మేము ఆంద్రప్రదేశ్  రాష్ట్రంలో పనిచేస్తామని  వేల సంఖ్యలో ముందుకు వస్తున్నారని ప్రభుత్వు అధికారులు అంటున్నారు.  దీంతో  తెలంగాణ నేతలు, ఆంధ్రనేతలు  షాక్ తిన్నారు.  వేల  మంది తెలంగాణ వాదులు ఆంధ్రలోపని చేస్తామని ఎందుకంటున్నారు?  

మొన్నటి నుండి సచివాలయంలో ఆంధ్ర ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యోగులకు  మద్య కంచె మొలిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం అలా కాదు..!!!  మేం ఆప్షన్ ఉపయోగించుకుంటాం, మమ్మల్ని ఆంద్రలోకి పంపించండి వీర తెలంగాణ ఉద్యోగులు  కమల్ నాథ్ కమిటికి  అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు.  ఇంత సడన్ గా  తెలంగాణ ఉద్యోగులు  ఆంద్రపై  ప్రేమ ఎందుకు కురిపిస్తున్నారో  కమల్ నథ్ కమిటికి అర్థం కాలేదు గానీ.. సీమాంద్ర ఉద్యోగులకు బాగనే అర్థమైంది. దీంతో  వేల సంఖ్యలో  తెలంగాణ ఉద్యోగులు  ఆంద్రల్లో పనిచేయటానికి కారణం ఇదే  అని సీమాంద్ర ఉద్యోగులు  కమల్ నాథ్ కమిటికి  వివరించారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  ఉద్యోగులకు  60ఏళ్ల  బంఫర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ఉద్యోగులు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు   ఎన్ని సార్లు  కలిసి  మా పదవి కాలం కూడా 60ఏళ్లు పెంచండి?  చంద్రబాబు ఆంద్ర ఉద్యోగులకు  60 ఏళ్లు పెంచిన విషయాన్ని  ఎన్నోసార్లు గుర్తు చేసి, విన్నతి పత్రాలు  సమర్పించారు.  కానీ   సిఎం కేసిఆర్  మాత్రం తెలంగాణ ఉద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు, కనీసం  చూద్దాం అని కూడా చెప్పలేదు. దీంతో  తెలంగాణ ఉద్యోగులు 60ఏళ్ల పదవి కాలం పై ఆశలు వదులుకొని, నీళ్లు చల్లుకున్నారు.

ఇలాంటి  సమయంలోనే తెలంగాణ ఉద్యోగులకు  ఆంధ్రలో చందమామ (చంద్రబాబు) గుర్తుకు వచ్చాడు.. ఎలాగో   ఉద్యోగులకు ఆప్షన్  ఉంది కాబట్టి ఉపయోగించుకుంటే.. రెండు ఏళ్ల పాటు  పదవి కాలం దక్కుతుంది, ఆ తరువాత  తెలంగాణ రాష్ట్రంలోకి  వచ్చి  ఫించన్ తీసుకోవచ్చునని,,  ఒకటి , రెండేళ్లలో  రిటైరయ్యవాళ్లు .. ఆంధ్ర ఆఫ్షన్  ను ఉపయోగించుకోవటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.  

 దీంతో చంద్రబాబు  ప్రభుత్వం  అదనంగా తెలంగాణ ఉద్యోగులకు  రెండేళ్ల పాటు అధనంగా జీతాలు ఇవ్వాల్సి  వస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతో  చంద్రబాబు పై అధిక  ఆర్థిక భారం పడుతుందని సీమాంద్ర ఉద్యోగులు అంటున్నారు. ఆంధ్ర లబ్ధితో  తెలంగాణ ఉద్యోగులు లాభపడలనే ఉద్దేశంతో   ఆఫ్షన్ కుట్ర చేస్తున్నారని  సీమాంద్ర ఉద్యోగులు అంటున్నారు. ఆంద్రపాలకులతో  విసిగిపోయిన  వీర తెలంగాణ వాదులు ఆంధ్రలో రెండేళ్లపాటు ఎలా పని  చేస్తారో ఎవరికి అర్థం కావటంలేదు. ఎవరినైన ఆట  ఆడించేంది ఆ డబ్బే కాబట్టే,  ఆంధ్రలోపనిచేయటానికి సిద్దమవుతున్నారు. ఆంధ్రోడితో పనిలేదు గానీ... ఆంధ్ర నుండి వచ్చే జీతాలు ఎలా తీసుకుంటారా తెలంగాణ తమ్ములారా అంటూ..  సమైక్యాంద్ర అన్నయ్యలు  అడుగుతున్నారు.  ఏమైన  తెలుగు వారు, తెలుగు జాతి, అభివృద్ది చెందాలని తెలుగు ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles