Chandrababu stops private land registration

Chandrababu stops Private Land Registration, Private Land Registration, AP CM Chandrababu stops registrations, Chandrababu stops, gunter, vijayawada, krishna,

Chandrababu stops Private Land Registration, AP CM Chandrababu stops registrations,

బాబూ.. భూముల రిజిస్ర్టేషన్లు ఆపండి?

Posted: 07/05/2014 11:59 AM IST
Chandrababu stops private land registration

బాబూ ! భూముల రిజిస్ట్రేషన్లు ఆపండి? అంటూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికలు జరిగిన నాటి నుండి.. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని పేరు ఏ ప్రాంతంలో వినబడితే..అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం .. మూడు పువ్వులు ..ఆరు కాయలుగా సాగుతుంది. దీంతో ఇప్పుడు సీమాంద్ర రాజధాని పేరు విజయవాడ- గుంటూరు , అమరావతి అంటూ ప్రకటనలు రావటంతో.. రియల్ వ్యాపారాలు రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోతున్నారు. దీంతో అక్కడ భూములను గద్దలా తన్నుకుపోతున్నారు. దీంతో అక్కడ భూమికి డిమాండ్ పెరిగిపోయింది. ఇది గమనించిన చంద్రబాబు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. !

విజయవాడ-గుంటూరు ఏరియాలో భూముల రిజష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పడుతుందన్న ప్రచారంతో భూముల ధరలు కొండెక్కడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో... మొత్తం 20 మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడనుంది. ఏపీ రాజధాని ఎక్కడన్న దానిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. ఎక్కువ మంది గుంటూరు...విజయవాడల మధ్యే క్యాపిటల్ ఏర్పాటు అవుతుందనని భావించడంతో.....ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

chandrababu-stops-private-land-registration

ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరకు...భూములు అమ్ముడవుతున్న ధరకు ఏ మాత్రం పొంతన లేక పోవడంతో రిజిస్ట్రేషన్ తక్కువ మొత్తానికే జరుగుతోంది. భారీగా భూముల రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతున్నా.....ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదు. దీంతో బెజవాడ....గుంటూరు మధ్య ల్యాండ్ వేల్యూపై నివేదిక పంపాల్సిందిగా రెండు జిల్లాల రిజిస్ట్రార్లకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్తాయిలో నివేదిక వచ్చిన తర్వాత భూముల ధరలను మార్కెట్ విలువకు దగ్గరగా నిర్ణయించి స్టాంప్ డ్యూటీతో భారీ మొత్తంలో ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ కసరత్తు మొత్తం పూర్తి అయ్యేదాకా రెండు జిల్లాల్లోని 20 మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా ఆపాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో అధికారికంగా ఆదేశాలు పంపనుంది ఏపీ సర్కార్.

కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, ఇబ్రహీపట్నం, ఆగిరిపల్లితో పాటు నూజివీడు మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోనున్నాయి. ఇక గుంటూరు జిల్లా పరిధిలోని పెదకాకాని, తాడేపల్లి, అమరావతి, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, తుళ్లూరు, గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ మండలాల్లో కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆగనుంది. కొత్త ధరలతో పాటు ఆదాయం పెంచుకోవడం ఒకటైతే.... కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ కూడా సులువు అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ రెండు జిల్లాల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్లు తాత్కలికంగా ఆపినట్లు తెలుస్తోంది.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles