Kiran kumar reddy has shut down his party office

ex cm kiran kumar reddy, kiran kumar reddy has shut down his party office, jai samaikyandhra party has shut down, andhra and telangana, telangana news, jai samaikyandhra party, andhra pradesh news, kiran kumar reddy has shut down his party office, jai samaikyandhra party office at madhapur.

kiran kumar reddy has shut down his party office

బయపడి అన్నీ మూసుకున్న కిరణ్?

Posted: 07/02/2014 01:48 PM IST
Kiran kumar reddy has shut down his party office

ఆట  ఆడకుండానే అవుట్ అవ్వటం  అంటే   అందరికి  చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.  కానీ  ఈయన మాత్రం  ఆట ఆడకుండానరే  అవుట్ అయ్యాడని రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు గోల గోల  చెస్తున్నాయి.   రాష్ట్ర విభజన సమయంలో  చివరి బంతి వరకు పోరాటం చేస్తానని ,  చివరకు  కనుమరుగైన.. మాజీ ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్  రెడ్డి. చెప్పుల  జోడితో   సమైక్యాంద్ర అంటూ..  జనం మద్యకు వచ్చిన..  ఫలితం లేకపోకుండపోయింది.  

రాష్ట్ర విభజన  సమయంలో ఆంద్రప్రదేశ్ రెండుగా విడిపోకుండా అడ్డుకోవాలాని.. బట్టి విక్రమార్కుడిలో  పోరాటం చేసిన  ఘటన నల్లారి వారికే దక్కుతుంది.  సమైక్యాంద్ర  అని .. సీమాంద్రలో  పార్టీ జెండ ఎగురువేసి,  చెప్పుల జోడుతో ఎన్నికల్లో తన ఆటగాల్ని, బందువులను  నిలబడితే..  కానీసం  డిపాజింట్ కూడా  దక్కకుండా  కిరణ్ పార్టీ గల్లంతైంది.  దీంతో  అప్పటి నుండి ఇంటికే  పరిమితమయ్యారు.

ముఖ్యమంత్రి  పదవిలో ఉన్నప్పుడు ..ఎంతో  దైర్యంగా   కాంగ్రెస్ అధిష్టానం పై  సవాల్  విసిరిన,  దాయదులపై  అసెంబ్లీలో తొడకొట్టిన,  చివరకు  ఆవేశంగా  రాజీనామా చేసిన,  రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయారు.  తెలుగు ప్రజలను  విడిపోకుండా  నల్లారి బాబు  చెప్పులు ఆపలేకపోయాయి. దీంతో   అవమానం,  మరొపక్క భయంతో నల్లారి బాబు  మీడియా ముందుకు   వచ్చే దైర్యం చేయలేకపోయారు.  ఇలాంటి సమయంలో  తన చెప్పుల జోడి పార్టీ నడటపం  చాలా కష్టమని భావించి, వెంటనే..అన్నీ మూసుకొని  బెంగుళూరుకి వెళ్లినట్లు  రాజకీయ వర్గాలు అంటున్నాయి.  

కిరణ్ కమార్ రెడ్డి  పార్టీ స్థాపన సమయంలో  మాదాపూర్ లోని కృతికా లేఅవుట్ లో భారీ  భద్రతా  ఏర్పాట్ల మద్య ఐదు అంతస్తుల  భవన్నాని  తీసుకొని..  వాటికి జెండాలు.. పోస్టర్లు ఏర్పాటు చేయటం జరిగింది.  అయితే  రెండు రోజుల క్రితమే ఆఫీసులో  ఉన్న  స్టేషనరీ .. ఫర్నీచర్ ను కూడా  గుట్టుచప్పుడు కాకుండా  తరలించినట్లు  స్థానికులు చెబుతున్నారు.  అయితే   ఇప్పుడు అన్నీ మూసుకొని..  కమలం పువ్వు చెవిలో పెట్టుకోవటానికి .. సిద్దపడినట్లు  .. ఆయన  సన్నిహితులు అంటున్నారు.

ఇటీవల  పెద్దపువ్వు గుర్తు  తెలంగాణ రాష్ట్రం బాస్..  ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో   నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి   రహస్య మంతనాలు  జరిపి,  ఢిల్లీ నుండి వచ్చే గ్రీన్ సిగ్నల్ కోసం  కిరణ్ కుమార్ రెడ్డి వేచి చూస్తున్నాడని  రాజకీయ వర్గాలు అంటున్నాయి.   కిరణ్  రాజకీయ జీవితం మళ్లీ పెద్దపువ్వులో  వికసించాలని ఆయన అభిమానులు  కోరుకుంటున్నారు.  ఇక పెద్ద పువ్వు పార్టీ నేతలు.. ఈ చిత్తూరు కిరణాలకు  స్థానం ఇస్తారో లేదో  చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles