Javadekar sent all the late comers on casual leave

broadcasting minister prakash javadekar, javadekar sent all the late comers on casual leave, prakash javadekar sent all employees who came late to work, javadekar was on an inspection on monday, government employees, government offices

javadekar sent all the late comers on casual leave

ఆలస్యంగా వచ్చారు.. ఇక సెలవు తీసుకోండి?

Posted: 07/01/2014 01:33 PM IST
Javadekar sent all the late comers on casual leave

ఆలస్యం అనే మాటలు.. ప్రతి ఒక్కరిలోను వినబడతాయి. అలాగే ఆలస్యంగా  చేస్తే  మనకు కొన్ని దక్కుండా పోతాయి. కొన్ని చోట్ల అయితే  ఏకంగా శిక్షలే పడతాయి. ఇవీ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవి. కానీ  మన కేంద్ర మంత్రి  ప్రకాశ్  జవదేకర్ కూడా ఇలా శిక్షవేయటం జరిగింది.

మన మంత్రిగారు..  కాలేజీ టీచర్ గా మారిపోయి..  ఉద్యోగులకు పాఠాలు చెబుతు శిక్షలు అమలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఢిల్లీలోని  సమాచారం శాఖ  ప్రధాన కార్యాలయం  శాస్త్రీ భవన్ కు  ఆ శాఖ మంత్రి  ప్రకాశ్  జవదేకర్  ఉదయం తొమ్మిది గంటలకు చేరుకున్నారు. తన  కార్యాలయంలోనే 9.30 గంటలకు  ఉన్నారు. ఇదే సమయంలో  ఆయనకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది.  ఒక్కసారి  కార్యాలయంలోని  వివిధ విభాగాలను  తనిఖీని చేస్తే ఎలా ఉంటుంది అనుకున్న వెంటనే.. ఆచారణలో పెట్టాడు. (ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన  కార్యాయలంలో  ఇలాగే వివిధ విభాగలపై.. చకర్లు  కొట్టిన విషయం తెలిసిందే)   అదే బాటలో  ఇప్పుడు ప్రకాశ్  జవదేకర్  తన కార్యాలయంలో  తనిఖీని ప్రారంభించారు.

 అయితే  అప్పటికే  పెద్ద  సంఖ్యలో అధికారులు , సిబ్బంది విధులకు  హాజరు కాలేదు.   ఇలా గంటపాటు అలా అన్ని విభాగాలు తనిఖీలు చేశారు. అయితే అక్కడ అన్ని ఖాళీ కూర్చిలే మంత్రిగారికి స్వాగతం పలికాయి.  దీంతో  మంత్రిగారికి కోపం  నషాలానికి ఎక్కింది.  వెంటనే తన పీఏతో..  ఈరోజు ఆలస్యంగా వచ్చిన అందరు.. నన్ను కలవమని  గట్టి చెప్పి తన ఛాంబర్ కు వెళ్లిపోయాడు. ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులు  మంత్రిగారి వద్దకు వెళ్లటంతో ఒక్కసారిగా  వారిపై  ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘‘ఈరోజుకు  మీరు ఇంటికి వెళ్లిపోండంటూ ’ దేశించారు.   ఆలస్యంగా వచ్చిన  ఉద్యోగులకు   సోమవారం  సాధారణ సెలవు కింద పరిగణిస్తామని స్పష్టం చేసి  పంపేశారు.

government employees

దీంతో  చేసిది ఏం లేక..మంత్రిగారిని తిట్టుకుంటూ..ఉద్యోగులు ..సోమవారం సెలవు తీసుకున్నారు.  మంత్రిగారి శిక్ష ఇలా ఉంటుందా? అని  ఆఫీసుల్లో పని ఉద్యోగులు నోరు వెల్లబెట్టారు. నాలాంటి ఉద్యోగులు మాత్రం.. కొంచెం ఆలస్యంగా వచ్చిన బాగుండేది.. సోమవారం సెలవు మిస్ అయ్యానని ..చేతులు నలుపుకుంటూ.. ఆరోజు సాయంత్రం వరకు నిట్టూర్పులు విరుస్తూ గడిపి ఇంటికి వెళ్లిపోయారు.   మంత్రిగారి ఆగ్రహానికి గురైన ఉద్యోగులు.. ‘‘ఏక్ విలన్’’ సినిమా    కు వెళ్లి ఎంజాయ్ చేసి  అందరు ఉద్యోగులతో పాటు..సాయంత్రం ఇంటికి వెళ్లిపోయారు.

అయినా  మంత్రిగారు.. అరిస్తే,  ఆవేశపడితే, ఉద్యోగుల్లో మార్పురాదయ్యా?  కొంచెం ఆలోచించి  ఉద్యోగులపై  ఆప్యాయత కురిపించి, వారికి కష్టాలు లేకుండా చేస్తే.. చెప్పిన సమయానికి ముందే వస్తారని.. సినియార్ ఉద్యోగులు  చెవులు కోరికేసుకుంటున్నారు.  మంత్రి పదవి 5 సంవత్సరాలు..! ఉద్యోగుల ఉద్యోగం .. 60 సంవత్సరాలు..! ఇలాంటి మంత్రులను మా జీవితంలోకి వస్తుంటారు..పోతుంటారు.. మేము మాత్రం  లోకల్ ఉద్యోగులం.  మీరు.. మీ ప్రభుత్వం  ఆయుష్షు కేవలం 5 సంవత్సరాలే, ఉద్యోగులకు ఆగ్రహం వస్తే.. మీ ప్రభుత్వ మళ్లీ ప్రతిపక్షంలో ఉంటుందని విషయం తెలుసుకోవాలని కొన్ని ఉద్యోగుల సంఘాలు మంత్రి పై మండిపడుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles