తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కాంగ్రెస్ పార్టీ సినియర్ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎదురుపడితే.. ఏం జరుగుతుంది అందరికి తెలుసు. కానీ ఎవరికి తెలియని నిజం ఒకటి దాగి ఉంది. తెలంగాణకు మొదటి శత్రువు ఎవరు అంటే వెంటనే.. తెలంగాణ ప్రజలు, తెలంగాణ నేతలు, తెలంగాణ వాదులు ముందుగా చెప్పే పేరు లగడపాటి రాజగోపాల్. తెలంగాణ ప్రజలు ముద్దుగా జగడపాటి అని పిలుచుకుంటారు. ఒక్కమాటలో చెప్పలంటే.. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో.. లగడపాటి పై ఒక పాట కూడా రాసి నిత్యం పాడుకున్నారు. అంటే శత్రువు పేరు మరిచిపోతామనే భయంతో.. తెలంగాణ వాదులు, మాటల రూపంలో, పాటల రూపంలో లగడపాటిని గుర్తు చేసుకుంటున్నారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక బంగారు తెలంగాణ కోసం అందరు కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు.. సీఎం కేసిఆర్ జెట్ స్పీడ్ దూకుడుతో పరిపాలన సాగిస్తున్న, మంచి సంపాదించుకుంటున్నారు. తెలంగాణలో ‘ఆంద్ర ’ అనే పేరు లేకుండా చేయటానికి కేసిఆర్ సర్కార్ ..రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు.
టీఎస్ ముఖ్యమంత్రిగా ఒక ముద్ర వేసుకోవటానికి ముందుగా కేసిఆర్.. గురుకుల్, అయ్యప్పసొసైటీ భూములను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సిఎం కేసిఆర్ దృష్టి మణికొండలోనే ల్యాంక్ హిల్స్ పై పడిందని రోజు మీడియాలో, పేపర్లలో లగడపాటి పై కేసిఆర్ ప్రతీకారం తీర్చుకుంటున్నాడని, ల్యాంకో హిల్స్ ను కేసిఆర్ స్వాధీనం చేసుకుంటున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు కేసిఆర్ , లగడపాటిలపై చేసిన సర్వలే ప్రకారం చూస్తే కొన్ని నిజాలు బయటపడ్డాయి. కేసిఆర్ సర్కార్ వల్ల లగడపాటికి గానీ, ల్యాంక్ హిల్స్ కు ఎలాంటి నష్టం లేదని అంటున్నారు. కానీ విషయాన్ని గులాబీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
కానీ అదే రేంజ్ లో సర్వేలు కూడా గులాబీ వర్గాల తీరును ఖండిస్తున్నాయి. అలా ఎందుకు అంటే.. ఒక్కసారి 2009 నుండి ఏం జరిగిందో రివిజన్ చేసుకోవాలని తెలంగాణ సర్వేలు, లగడపాటి సర్వేలు చెబుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే.. కేసిఆర్, లగడపాటి మంచి మిత్రులు, కాదు... కాదు మంచి లవర్స్ (ప్రేమికులు). ఇద్దరు వేరు వేరు పార్టీల ‘‘ఎంపీలు.. హైదరాబాద్ లో తిట్టుకొని, ఢిల్లీలోని లోక్ సభలో కలుసుకొని, కౌగిలించుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ’’ 2009లో కేసిఆర్ నిరాహారదీక్ష చేస్తూ.. నిమ్స్ లో చేరినప్పుడు.. లగడపాటి ఆరాటం అంత ఇంత కాదు. ‘‘కేసిఆర్ నిమ్స్ నుండి ఇంటికి వెళ్లిన వెంటనే.. విజయవాడ నుండి లగడపాటి లంగ్ జంప్ చేసి నిమ్స్ బెడ్ పై పడిన’’ విషయం తెలుగు ప్రజలకు బాగా తెలుసు.
ఆ తరువాత.. ‘‘కేసిఆర్ ఐలవ్ యూ ’’ అని గులాబీ బాస్ చెప్పిన వెంటనే.. ‘‘లగడపాటికి ఐ టూ లవ్ యూ ’’ అంటూ పబ్లిక్ మీడియా ముందు ముద్దులు వర్షం కురిపించుకున్నారు రాజకీయ నేతలుగా ఢిల్లీలో పేరు తెచ్చుకున్నారు. ఆ నాటి నుండి .. ఈ ఇద్దరి మద్య విమర్శలు, మాటల యుద్దం జరిగింది గానీ , ఏరోజైన .. ఇద్దరు ఆస్తులు గురించి , కుటుంబ విషయాల గురించి పబ్లిక్ లో మాట్లాడుకున్నారా? ఆస్తుల లెక్కలు గురించి ఎక్కడైన నోరు విప్పారా? ‘‘ఇదే రాజకీయ ప్రేమంటే ’’. అని సర్వేలు చెబుతున్నాయి. లగడపాటికి ..హైదరాబాద్ లో ఆస్తులుంటే , కేసిఆర్ కు గుజరాత్ లో ఆస్తులు ఉన్నట్లు లగడపాటికి సర్వేలు చెబుతున్నాయి.
ఈ సర్వేలు ప్రకారం చూస్తే.. టీఎస్ ముఖ్యమంత్రి కేసిఆర్ , మాజీ ఎంపీ లగడపాటీల మద్య మంచి సన్నిహిత సంబంధాలు బలంగా ఉన్నట్లు రాజకీయ మేథావులు అంటున్నారు. అందుకే టీఎస్ ముఖ్యమంత్రి కేసిఆర్.. లగడపాటి, ల్యాంకో జోలికి వెళ్లడని ఇరుప్రాంతాల రాజకీయ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more