Chandrababu hugs and praises pawan

Chandrababu hugs and praises Pawan, Chandrababu Naidu hugs Pawan Kalyan, Chandrababu hug to Pawan Kalyan, Chandrababu Naidu swearing ceremony, Pawan Kalyan at Chandrababu Naidu swearing, Vivek Oberoi, Chandrababu hugs and praises Pawan, పవన్ పై బాబు చెయ్యి , పవన్ పై 'బాబు' చెయ్యి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత కొణిదేల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు

Chandrababu hugs and praises Pawan, Chandrababu Naidu hugs Pawan Kalyan, Chandrababu hug to Pawan Kalyan, Chandrababu Naidu swearing ceremony, Pawan Kalyan at Chandrababu Naidu swearing, Vivek Oberoi, Chandrababu hugs and praises Pawan,

పవన్ పై 'బాబు' చెయ్యి?

Posted: 06/09/2014 02:36 PM IST
Chandrababu hugs and praises pawan

అక్కడ అంత పచ్చ చొక్కలు, పచ్చ జెండాలు, అంత పసుపుమయంతో నిండిపోయింది. సైకిల్ కార్యకర్తలు ఆనందంగా, ఉత్సహాంగా కనిపిస్తున్నారు. కానీ ఇంతలో ..తెల్ల చొక్క, బ్లూ జీన్స్ ధరించిన వ్యక్తి కారులోంచి దిగటంతో.. అందరి చూపులు, కెమెరా కళ్లు అతనిపై పడ్డాయి. దీంతో చంద్రబాబు ఒక్కసారి అల్టర్ అయ్యి , పరుగు..పరుగున ఎదురెళ్లి ఆ వ్యక్తిని తన సంపూర్ణ కౌగిలిలో బంధించాడు. దీంతో అక్కడే ఉన్న పచ్చచొక్క తమ్ముళ్లు షాక్ తిన్నారు.

సహజంగా చంద్రబాబు ఇప్పటి వరకు.. ఆయన రాజకీయ చరిత్రలోకి తొంగి చూస్తే, వస్తున్న వ్యక్తికి ఎదురువెళ్లి కౌగిలించుకున్న దాకలు లేవు. ఎవరైన దగ్గరికి వచ్చిన తరువాతే చంద్రబాబు చెయ్యి కలుపుతారు. అలాంటి చంద్రబాబు నిన్నసభలో జరిగిన విషయాన్నిచూసి, అక్కడున్న తమ్ముళ్లు ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది. అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అని అనుకుంటున్నారా? అధికారం కోసం అష్టకష్టాలు పడుతూ.. పదేళ్లుగా ఎదురుచూస్తున్న చంద్రబాబుకు అధికారం రావటానికి ..తన వంతుగా సాయం చేసిన ..‘‘జనసేన అధినేత కొణిదేల పవన్ కళ్యాణ్ ’’..

చంద్రబాబు గతంలో అనేక పార్టీలో నాయకులతో మద్దతు తీసుకున్నారు. కానీ వారితో ఎంతవరకు అంటే, అంత వరకే రాజకీయ జరిపాడు. కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం అలా కాదు. సభలోకి వస్తున్న పవన్ కళ్యాన్ కు చంద్రబాబు ఎదురెళ్లి. అప్యాంగా కౌగిలించుకోని, పవన్ పై చెయ్యి వేసి, తనలో ఉన్న ఆత్మీయ, అనురాగంను..పవన్ కు పంచిపెట్టారు చంద్రబాబు. అప్పుడు కేంద్రం హోంమంత్రి రాజ్ నరసింగ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి అక్కడే ఉన్నారు. కానీ బాబు మాత్రం పవన్ పై చూపించి అభిమానం అంత ఇంత కాదు. ఈ సన్నివేశం చూసిన కెమెరా కళ్లు మెరుపు ల స్టౌండ్ తో తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. దీంతో పార్టీలోని సీనియర్ నాయకులు సైతం.. ఆశ్చర్యపోయినట్లు సమాచారం.

Pawan-chandrababu

అంతేకాకుండా.. సభలోని వేదిక పై కూర్చున్న అతిరథ మహా రధుల మద్య పవన్ కు స్థానం కల్పించారు చంద్రబాబు. అంతేకాకుండా బాబు తన ప్రసంగంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా చేసిన సహాయాన్ని సభాముఖంగా కొనియాడుతూ అందుకు కృతజ్ఞతలు చెప్పటంతో.. సభలో కొద్ది సేపు.. చప్పట్ల స్టౌండ్ తో పేలిపోయింది.

దీంతో పాటు ..కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సభకు వచ్చిన ముఖ్య అథితులను పరిచయం చేస్తూ, యువ నటుడు, యంగ్ డైనమిక్, పవర్ పుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పటంతో.. సభలో ఒక్కసారిగా భారీ ఎత్తున అలజడి లేసింది. పవన్ పేరు వినబడిన వెంటనే సభలో చప్పట్లు, విజిల్స్ ల సందడితో ఆ ప్రాంతమంత మారుమ్రోగిపోయింది.

దీంతో వెంకయ్య నాయుడు ..కొద్ది సేపు తన ప్రసంగాన్ని ఆపి, కార్యకర్తల ఆనందాన్ని తిలకించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ .. కార్యకర్తలకు అభివాదం చేస్తూ.. వేదిక పై ముందుకు నడిచి రావటంతో ..సభలోని సందడి మరీ ఎక్కువైంది. ఈ సన్నివేశాన్ని కల్లారా చూసిన చంద్రబాబు, కేంద్రమంత్రులు ఆనందంగా ఎంజాయ్ చేసినట్లు తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మారిన చంద్రబాబును ..అందరు చూపి ఆనందం వ్యక్తం చేయటం జరిగింది.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles