Balakrishna leg political entry to tdp chandrababu naidu win

balakrishna leg political entry, Balakrishna to Contest Hindupur, Chandrababu Naidu, CM Chandrababu Naidu , TDP Politics, Tdp leaders, Balakrishna Meet Chandrababu Naidu.

balakrishna leg political entry to tdp chandrababu naidu win

బాలయ్య అడుగే పార్టీకి కలిసివచ్చిందా?

Posted: 06/09/2014 10:40 AM IST
Balakrishna leg political entry to tdp chandrababu naidu win

ఇప్పుడు పచ్చచొక్క తమ్ముళ్లు కొత్త కొత్తగా మాట్లాడుకుంటున్నారు. ఆంద్రాప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆంద్రలోని అన్నీ నగరాలు.. పసుపుమయంతో నిండిపోయింది. పదేళ్ల తరువాత.. పచ్చచొక్క తమ్ముళ్లు.. ఆనందంగా పండగ చేసుకున్నారు.

నారా చంద్రబాబు నాయుడు ప్రమాణా స్వీకారం ఒక పండగ అయితే అక్కడ మరో పండగ వాతావరణం సభలో నెలకొన్నది. ఒకే చోట.. నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం కనిపించి, తెలుగుదేశం తమ్ముళ్లుకు ఆనందాన్ని పంచారు. సభలోని వారి రెండు కళ్ల నిండా నారా కుటుంబం, నందమూరి కుటుంబం సభ్యుల సందడితో చేసే భాగ్యం కలిగిందని సభకు వచ్చిన కార్యర్తలు అంటున్నారు.

అయితే తెలుగు తమ్ముళ్లు .. నందమూరి బాలయ్యను, నారా చంద్రబాబు ను చూసి తెగ ఆనందపడిపోయినట్లు సమాచారం. అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్ రాకతో కూడా సరికొత్త సంతోషాన్ని నింపినట్లు తెలుస్తోంది. ఈ సభలో తెలివిగల తెలుగుదేశం తమ్ముళ్లు మాట్లాడుకుంటూ..బాలయ్య అడుగుతో.. బావకు అధికారంవచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. లెజెండా సినిమా హిట్ కావటం, బాలయ్య ఎమ్మెల్యేగా గెలవటం, బావకు అధికారం రావటం, జూనియర్ ఎన్టీఆర్ సభకు రావటం, అన్ని మంచి శకునాలే అని బాలయ్య అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

బాలయ్య సెంటిమెంట్.. బావకు బాగా నచ్చిందని ..పార్టీలోని సీనియర్ నాయకులు చెబుతున్నారు. పార్టీలోకి బాలయ్య తొలి అడుగు పెట్టిన వెంటనే.. పార్టీకి అధికారం వచ్చిందని సీనియర్ నేతలు బాలయ్య ముందే అంటున్నారు. కానీ బాలయ్య మాత్రం వారి మాటలకు అట్టుకట్ట వేయకుండా.. చిన్న స్మైల్ తో బాగా ఎంజాయ్ చేశాడని మీడియా వర్గాలు అంటున్నాయి. ఏమైన బావ, బావమరిదుల సేవలు తెలుగు ప్రజలకు చాలా అవసరమని పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు. ఈ ఐదు సంవత్సరాలలో సీమాంద్ర ప్రజలకు బావ, బావమరిది ..ఎంత వరకు సేవ చేస్తారో.. చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles