Kcr adds naya condition to telangana farmer loan waiver

KCR CM adds fresh condition, Telangana CM adds fresh condition, farm loan waiver, T-Farmers Shock, KCR, KCR Farm Loan Waiver, KCR Farm Loan Waiver conditions, KCR crop Waiver, TRS Crop Loan Waiver, Telangana Farmer Loan Waiver,

KCR adds Naya condition to Telangana farmer loan waiver, Telangana CM adds fresh condition to farm loan waiver, T-Farmers receive First Shock from KCR

మాఫీ ముచ్చటలో ఘోరాలు-నేరాలు?

Posted: 06/05/2014 12:43 PM IST
Kcr adds naya condition to telangana farmer loan waiver

ఎన్నికల సమయంలో ఆరంగుళాల నాలుకతో . బెల్లి డ్యాన్స్ చేసిన తెలంగాణ రాజకీయ నేతలు. అధికారం కోసం అర్థరాత్రి హామీలు రాసుకోని పట్టపగలు ..ప్రజల మద్య గొప్పగా హామీలు ఇవ్వటం జరిగింది. అధికారం రాబోతుందనే ఆనందం ఒక పక్క, కొత్త రాష్ట్రం ఏర్పడుతుందనే .. ఉత్సహం మరో వైపు.. మన గులాబీ నేతల చేత. హామీల వర్షం కురిపించాయి.

గులాబీ నేతలు కురిపించిన హామీల వర్షంలో బాగా తడిసిపోయి, మా జీవితాలు, మా పొలాలు బాగుపడతాయని.. ‘కారు’ మబ్బులు తొలిగి.. వెలుగు జీవితాలు వస్తాయని.. ఆనందంగా ..గులాబీ నేతలను గెలిపించారు. కానీ అధికార పదవి చేతిలోకి రాగానే.. ఇచ్చిన హామీలపై .. కసరత్తు మొదలుపెట్టి.., రోజకోక రకంగా.. ఘోరమైన ప్రకటనలు చేస్తున్నారు. రుణామాఫీలు చేస్తాం ..కానీ అందరికి కాదు.. గోల్డ్ లోన్ అంతకంటే కాదని గులాబీ పార్టీ మంత్రులు బల్ల గుద్ది చెబుతున్నారు.

తెలంగాణ రైతుల రుణామాపీ మొత్తం .. 57 వేల కోట్లులని లెక్కలు తెల్చిరు బ్యాంకు అధికారులు. గులాబీ మంత్రులు సమావేశం అయ్యి .. రుణామాపీలపై.. కొత్త కొత్త నేరాలు స్రుష్టించారు. కేవలం 12 వేల కోట్ల రుణామాపీ మాత్రమే చేస్తాం. అదీ కూడా .. 2013, 2014 మద్యలో తీసుకున్న రుణాలే అని ఘోరమైన ప్రకటనలు చేయటంతో.. తెలంగాణ రైతుల ఆశలపై మాపీ దెబ్బలు ఘోరంగా పడినట్లు తెలుస్తోంది. ‘‘ ఏరు దాటక ముందు మల్లన్న.. ఏరు దాటినాక.. బొడి మల్లన్న’’ అనే విధంగా గులాబీ మంత్రులు ప్రవర్తిస్తున్నారని.. తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

kcr-loan-waiver

తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం అందరికి న్యాయం చేస్తాం. కానీ ఐదు సంవత్సరాలు ఓపిక పట్టాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. ‘‘ఆకలైనప్పుడు అన్నం పెట్టాలి గానీ.’’ నా పెళ్లికి తిందువులే అని చెబితే.. ఆకలైనోడికి ..ఎక్కడో కాలుతుంది.అదేవిధంగా..హామీలు ఇచ్చారు కాబట్టి, అమలుపరచండని..తెలంగాణ రైతులు అడుగుతున్నారు.

హామీలుఇచ్చింది మీరే.. ఆగమనేది మీరే...? అలాంటప్పుడు.. హామీలుఇవ్వటంఎందుకు.... తీర్చలేక .సతమతమవ్వటం ఎందుకని టి-రైతులు అడుగుతున్నారు. కానీ గులాబీ బాస్ మాత్రం .. మరి కొన్ని రోజలు వాయిదా వేసి, పరిస్థితి పై క్షుణ్ణంగా పరిశీలించి, తెలంగాణ రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనలతో ఉన్నట్లు .. ఆ పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు.

అలాగే లక్షకుపైగా రుణం తీసుకున్న రైతుల విషయంలో లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ వర్తిస్తుందని, మిగతా మొత్తాన్ని వారే చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన వివరించారు. ఇక వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలుగా మారిన పంట రుణాలు, పరోక్ష రుణాలకు ఈ మాఫీ వర్తించదని కూడా బ్యాంకర్లకు కేసీఆర్ తేల్చి చెప్పారు.

మూడు నాలుగేళ్లుగా బకాయిలు చెల్లించని వారికి రుణ మాఫీ వర్తించదని స్పష్టం చేశారు. రుణ మాఫీతో సంబంధం లేకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నెల 9న బ్యాంకర్లతో మళ్లీ సమావేశంకావాలని నిర్ణయించారు. చివరకు గులాబీ నేతలు ఎలా మాపీ చేస్తారో.. చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles