Gandhis became backbenchers in loksabha

Gandhis became backbenchers in Loksabha, Rahul Gandhi sits in Loksabha last row, Varun Gandhi sits in last row

Gandhis became backbenchers in Loksabha

ఇద్దరు గాంధీలు వెనక బెంచీల్లో!

Posted: 06/04/2014 04:48 PM IST
Gandhis became backbenchers in loksabha

ఈ రోజు ప్రారంభమైన 16 లోక్ సభ సమావేశాలలో విచిత్రంగా ఇద్దరు గాంధీలు బ్యాక్ బెంచీలకు అంకితమయ్యారు.  అందులో ఒకరు రాహుల్ గాంధీ.  ఆయన లోక్ సభ ప్రతిపక్ష స్థానాల్లో అస్రార్ ఉల్ హక్, శశి థరూర్ ల సరసన చివరి వరుసలో కూర్చున్నారు.  మొదటి వరుసలో కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వీరప్ప మొయిలీ, మునియప్ప కూర్చున్నారు.  

అయితే అధికారపక్షంలో కూడా చివరి వరుసలో కూర్చున్న మరో గాంధీ ఉన్నారు.  ఆయన భాజపా తరఫున సుల్తాన్ పూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన వరుణ్ గాంధీ.  రాహుల్ గెలుపొందిన అమేథికి సుల్తాన్ పూర్ ఎంతో దూరం ఉండదు.  కానీ పార్టీ పరంగా ఇద్దరికీ మధ్య ఎంతో దూరం! 

మరో విచిత్రమైన సంఘటనేమిటంటే, అమేథీ నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో వెనక సీటులో కూర్చుంటే అదే స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన స్మృతి ఇరానీ మంత్రి పదవినలంకరించింది! ఆమె గెలిచుంటే అమేథీ పరిధిలో పనిచేసేదేమో.  ఓడిపోబట్టి జాతీయ స్థాయిలో పనిచేస్తోంది.  తన కోసం కాకుండా పార్టీ తరఫునుంచి గట్టి పోటీనిచ్చిన యోధురాలిగా ఆమెకు భాజపా మంత్రి పదవిని కట్టబెట్టింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles