Build toilets to tackle rape sulabh founder to modi

Badaun gangrape, Toilet facility, Sulabh International, Narendra Modi, Dr. Bindeshwar Pathak, Open defecation, Social security issues

Build toilets to tackle rape Sulabh founder to Modi

రేప్ లను అరికట్టేది ఒక్క టాయిలెటేనట?

Posted: 06/04/2014 01:51 PM IST
Build toilets to tackle rape sulabh founder to modi

కాంగ్రెస్ పాలనలో ఉన్న సమయంలో జైరాం రమేష్.. మరుగుదొడ్లు కట్టించుకోండని అరిచి .. అరిచి అలసిపోయిన విషయం తెలిసిందే. మరుగు దొడ్డి ఉంటే.. చాలు సెల్ ఫోన్ అవసరం లేదని చెప్పిన ఎకైక రాజకీయ నాయకుడు మన జైరాం రమేష్. అయితే ఇప్పుడు మరొకరు సరికొత్తగా చెబుతున్నారు.

దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు, మానభంగాలు, రేప్ లను అరికట్టాలంటే.. ఒక్కటే మార్గమని చెబుతున్నారు. టాయిలెట్ తో దేశంలో జరుగుతున్న అత్యాచారాలను అరికట్టవచ్చునని పారిశుద్ధ్య ఉద్యమ సంస్థ ‘సులభ్’ వ్యవస్థాపకుడు బిందేశ్వర పాఠక్ అంటున్నారు.

ఈయన చెపిన దానిలో కొంత నిజమే అనిపిస్తుందని.. కొన్ని పార్టీల రాజకీయ నాయకులు అంటున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమికి వెళ్లే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలంటే మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లను నిర్మించవలసిన ఆవశ్యకత మనపై ఉందని బిందేశ్వర్ పాఠక్ చెబుతున్నారు. అయితే

‘‘ఇంట్లో టాయిలెట్ లేకపోవడంతో మహిళలు రాత్రి వేళల్లో సైతం బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. అదే ఇంట్లో టాయిలెట్ ఉంటే వారు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో టాయిలెట్ ఉండడం వల్ల వారు మరింత సురక్షితంగా ఉండగలరు. మహిళలపై అత్యాచారాల నిరోధానికి ఇదొక్కటే మార్గం’’ అని పాఠక్ అంటున్నారు

‘‘ముందు టాయిలెట్..ఆ తర్వాతే మందిరం’’ అన్న నినాదాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘చాలామంది బాలికలు తమ కోసం టాయిలెట్లు లేవన్న కారణంగా స్కూలుకు కూడా వెళ్లడం లేదు. పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోతే వచ్చే వ్యాధులు దాదాపు 50 దాకా ఉన్నాయి. ఈ సమస్యలన్నిటినీ అధిగమించవచ్చు’’అని పాఠక్ చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ద్రుష్టి తీసుకెళ్లి, మహిళకు న్యాయం చేస్తానని . పాఠక్ చెబుతున్నారు. మరికొంత మంది రాజకీయ నాయకులు కూడా పాఠక్ ఆలోచనపై.. హస్తం కలిపినట్లు సమాచారం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles