Telangana congress leaders warning to ponnala lakshmaiah resigns

congress leaders warning to ponnala, T-congress leaders warning to ponnala lakshmaiha, Telangana state pcc ponnala lakshmaiha, 2014 election, Congress party, Trs party, ponnala lakshmaiah resigns, sonia gandhi, Telagana state Jun 2.

Telangana congress leaders warning to ponnala lakshmaiah resigns, T-congress leaders demand to ponnala resigns

రాజీనామా చేస్తావా? రాత్రికి నిద్రలేకుండా చేయమంటావా?

Posted: 05/29/2014 11:37 AM IST
Telangana congress leaders warning to ponnala lakshmaiah resigns

‘‘నువ్వు రాజీనామా చేస్తావా? లేక రాత్రికి నిద్రలేకుండా చేయమంటావా? అనే మాటలతో.. ఆయనకు నిజంగా నిద్రలేకుండా పోతుంది. నిన్నటి వరకు ఆయన చుట్టు బౌన్సర్ల సెక్యూరిటితో.. రాజకీయ నేతలతో సమావేశం అయిన ఐదగుడుల బుల్లెటు.. ఇప్పడు ఒంటరిగా నాలుగు దిక్కులు చూస్తూ సమయం గడుపుతున్నారు. ‘‘నేనేమి చేసాను నేరం, నన్నునేక్కడంటింది పాపం ’’ అంటూ పాటలు పాడుకుంటూ.. తన ఓటమిని, పార్టీ పరాజయాన్ని తలుచుకోని కుమిలిపోతున్నారు తెలంగాణ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య.

నిన్నటి వరకు గాంధీ భవన్ లో చక్రం తిప్పిన ఆయన.. నేడు ఆ భవనం వైపు కూడా చూడటలేదని ..కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఇక పార్టీలోని తెలంగాణ సీనియర్ నేతలు మాత్రం ‘‘నీ వల్లే .. నీ వల్లే ..మేం ఓడిపోయాం, మన పార్టీ పరువు పోయిందని’’ తెగ గుస్సా చేస్తున్నారు. ఆ పార్టీలోని కార్యకర్తలు అయితే.. ‘‘నువ్వు రాజీనామా చేస్తావా? లేక రాత్రికి నిద్రలేకుండా చేయమంటావా’’ అంటూ వార్నింగ్ ఇవ్వటంతో. పొన్నాల పరిస్థితి ఘోరంగా తయారైందని పార్టీలోని ఆయన అభిమానులు అంటున్నారు.

ఎన్నికల సమయంలో.. గులాబీ బాస్ పై.. ఎగిసిపడిన పొన్నాల.. ఎన్నికల తరువాత చాలా సైలెంటుగా ఓటమి బాధను అనుభవిస్తూ, వస్తున్న ఏడుపును ఆపుకోలేక అల్లాడిపోతున్నట్లు పార్టీలోని ఆయన అభిమానులు అంటున్నారు. ఇప్పుడు పొన్నాల పరిస్థితి ‘‘ఇంట్లో ఇనుప కత్తి .. బయట బంగారు కత్తి ’’ లాగా ఉందని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అంటున్నారు.

T-congress-leaders-vs-ponnala

అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ హైకమాండ్ నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో పొన్నాల కాస్త ఊపీరి పీల్చుకుంటున్నారు. నిన్నటి వరకు అధికారంలో ఉన్న వారు ఇక నుండి గులాబీ బాస్ ఎదుట .. ప్రతిపక్షం పాత్ర పోషించాల్సిందేనా అని కాంగ్రెస్ పార్టీలోని సినియర్ నాయకులు అవమానంతో నలిగిపోతున్నట్లు సమాచారం.

తెలంగాణ ఆవిర్బాదిన్సోతానికి కొద్ది రోజులే ఉండటంతో పొన్నాల ఆందోళన చెందుతున్నారు. ఆరోజు గులాబీ దళం , మిగిలిన పార్టీలు పండగ చేసుకుంటున్నాయి. మరీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి, దీనికి హైకమాండ్ ఒప్పుకుంటుందా లేదా అని కాంగ్రెస్ పార్టీలోని వయసు ముదిరిన నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది.

అసలే ‘‘తింటానికి తికనం లేదని బాధపడుతుంటే.. తెల్ల చొక్క కావాలని గోల చేశాడట’’ అనేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు , కార్యకర్తల పరిస్థితి అలా తయారైనట్లు తెలుస్తోంది. అధికారం పోయి అల్లో రామచంద్రా అని బాధపడుతున్న హైకమాండ్ కు , తెలంగాణ పీసీసీ పొన్నాలకు తెలంగాణ ఆవిర్బాదినోత్సం పెద్ద తలనొప్పిగా మారిందని కాంగ్రెస్ పార్టీ నేతలే .. గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. జూన్ 1 అర్థరాత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేతలు, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

అందుకే ముందుగా తెలంగాణ ఐదడుగుల బుల్లెటు  ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో   భేటీ  అయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో కలిసి తన గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణాలో పార్టీ ఓటమికి గల కారణాలను వారికి వివరించారు. అదే విధంగా రాష్ర్టంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితిని కూడా వివరించినట్లు సమాచారం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles