Minister venkaiah naidu 2020 dream

minister venkaiah naidu 2020 dream, venkaiah naidu 2020 dream, venkaiah naidu, Housing for all by 2020, Urban Development Ministry, M Venkaiah Naidu, housing schemes, BJP government, NDA government

minister venkaiah naidu 2020 dream, Housing for all by 2020

ప్రాణం పోసుకున్ననాయుడు 2020 కల?

Posted: 05/29/2014 10:33 AM IST
Minister venkaiah naidu 2020 dream

నెల్లూరు జిల్లా ముప్పవరపు వెంకయ్య నాయుడి ముఖంలో సరికొత్త నవ్వులు చిగురించాయి. పవ్వు గుర్తు నాయకుడి అందరికి తెలుసు. కానీ నాయుడు వల్ల .. పెద్దగా నెల్లూరు ప్రజలుగానీ, రాష్ట్ర ప్రజలు గానీ లబ్ధిపొంది లేదు. ఇన్నాళ్లు అధికారం లేకనో, వయసు ముదిరో తెలియదు గానీ ప్రజా సేవా కొంచెం దూరంగా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంద్ర నాయకుడిగా సీమాంద్ర కోసం పార్లమెంట్ లో ‘‘ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్, అధ్యక్ష ఒక్కసారి సీమాంద్ర గురించి ఆలోచించండి పదే పదే.. స్పీకర్ చేసిన పోరాటమే.. ఆయనకు మంత్రి పదవిని తెచ్చిపెట్టాయి.

మోడీ సభలో మంత్రి పదవి దక్కటంతో.. ఆనందతో ఊగిపోయారు. ముదిరిన వయసులో.. నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని లేని సీమాంద్ర ప్రజలకు ఏమైన చెయ్యలని నిర్ణయించుకున్నారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణకు ముందు శ్రీనివాసుడికి వెంకయ్య నాయుడు పూజలు చేసి తన మనసులో కల ను బయటపెట్టారు.

Venkaiah-Naidu-housing-schemes

2020 కల్లా సొంతిళ్లు సంపాదించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆయనకు సొంతిళ్లు కాదులేండి. వచ్చే ఆరేళ్లలో దేశ ప్రజలందరి సొంతింటి కల నిజం చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ, పేదరిక నిర్మూలన శాఖల మంత్రి వెంకయ్య నాయుడు చెప్పటం జరిగింది. ఇంటి రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు ద్వారా 2020 నాటికి అందరికి సొంతిల్లు నిర్మాణానికి తమ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతనిస్తోందన్నారు.

ప్రతి పౌరుడికి పక్కా ఇల్లు నిర్మాణం అంత తేలికేం కాకపోయినా, అసాధ్యమేమీ కాదన్నారు. దీనిపై తమ శాఖ తీవ్ర స్థాయిలో దృష్టి పెడుతుందని వెంకయ్య చెప్పారు. ఈ లక్ష్యాల సాధన కోసం ప్రయివేట్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అమలు చేయడానికి, కార్పొరేట్ల సహకారం తీసుకుంటామని వెంకయ్య నాయుడు తెలిపారు. రాష్ట్రప్రభుత్వాలు, పురపాలక సంఘాలకు ఇళ్ల నిర్మాణంలో భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. ఎల్ఐసి, బ్యాంకులు, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బందికి, రక్షణ శాఖ సిబ్బందికి, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు కూడా సొంతింటి కల సాకారం చేస్తామన్నారు.

వెంకయ్య నాయుడు తీసుకున్న నిర్ణయం పై దేశ ప్రజలు , ముఖ్యమంత్రి సీమాంద్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన అభిమానులు అయితే 2020 కల్లా వెంకయ్య నాయుడు కల తీరాలని భారీ ఎత్తున పూజలు చేస్తున్నారు. దీంతో పార్టీలోని సీనియర్ నేతలు.. వెంకయ్య నాయుడు మళ్లీ ప్రాణం పోసుకున్నాడని జోకులేసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles