Ys jagan speaks to chandrababu life history

ys jagan, chandhrababu, ys jagan speaks to chandrababu lif, chandrababu life history, tdp, ysrcp, election 2014, seemandhra election 2014.

ys jagan speaks to chandrababu life history ,

ఎన్నికల గురించి నాకు -చంద్రబాబుకే తెలుసు? జగన్

Posted: 05/01/2014 11:19 AM IST
Ys jagan speaks to chandrababu life history

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రాజశేఖరరెడ్డి, సీమాంద్రలో ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. అతి కొద్ది రోజుల్లో మీ తలరాతను మార్చే ఎన్నికలు వస్తున్నాయని సీమాంద్ర ప్రజలకు చెప్పటం జరిగింది. ఈ ఎన్నికలు మనకు చాలా కీలకమైనవి అని జగన్ చెప్పటం జరిగింది. అయితే ఈ ఎన్నికల గురించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు నాకు తెలుసు. ఇవి చివరి ఎన్నికలు.

చంద్రబాబు అధికారం కోసం ఉచిత హమీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని జగన్ చెప్పడంతో.. సభలోని ప్రజలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంటే జగన్ చెబుతున్న మాటలు నిజమేనా? అనే అనుమానంతో సైలెంట్ జగన్ ప్రసంగంలో నిమగ్నమైయ్యారు. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా గూడుకట్టుకున్న నాయకుని ఎన్నుకోవాలని ఆయన చెప్పటం జరిగింది. పరోక్షంగా చంద్రబాబు ఎన్నుకోవాలని జగన్ చెప్పటంతో.. సభలో సందడి మొదలైంది. దీంతో ఆ పార్టీలోని సీనియర్ నాయకులు జగన్ వైపు చూసి తలకొట్టుకోవటంతో తను చేసిన తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నం చేయటం జరిగింది.

అంతేకాకుండా నా ఐదు సంతకాలు .. మీ తలరాతను మార్చుతాయని ఆయన చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉందని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. అంటే జగన్ ముఖ్యమంత్రి అయితేనే .. ఐదు సంతాకాలు. లేకపోతే.. మాత్రం సీమాంద్ర ప్రజలకు కష్టాలే అని జగన్ గుర్తు చేయటం జరిగిందని రాజకీయ మేథావులు అంటున్నారు. అంటే జగన్ కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం .. సీమాంద్ర ప్రజలకు ఐదు సంతకాలు ఎరగా వేసినట్లు ఆ పార్టీలోని చదువుకున్న సీమాంద్ర కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

జగన్ సీమాంద్రలో గెలిస్తే.. ఐదు సంతకాలు తరువాత ఆరో సంతకం గురించి ఆలోచిస్తానని చెప్పటంతో.. సీమాంద్ర ప్రజలు అయోమయంలో పడ్డారు. బైబిల్ చదివే జగనేనా ఇలా మాట్లాడుతుంది అనే అనుమానం సీమాంద్ర క్రిస్టియన్స్ కు కలిగినట్లు తెలుస్తోంది. ఒక వైపు జీసస్ మార్గంలో నడుస్తూ.. సీమాంద్ర ప్రజలను జగన్ మోసం చేస్తున్న తీరు పై క్రైస్తవ సంఘాలు మండిపడుతున్నాయి.

జగన్ మాటల్లో పదే పదే.. మూడు మాటలు వినబడుతున్నాయి. నేను ముఖ్యమంత్రి కావాలి? నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి? నేను 30 ఏళ్ల పాటు రాజకీయల్లో ఉండాలి? ఈ మూడు మాటల వెనుక అర్థం ఏమిటో సీమాంద్ర ప్రజలకు అర్థం కావటంలేదని అంటున్నారు. ప్రజలు చేయాల్సిన పనులను జగనే ముందుగా రాసుకొని, నా కోరికలు తీర్చాండని ప్రజల ముందుకు రావటం చాలా ఆశ్చర్యంగా ఉందని రాజకీయ మేథావులు అంటున్నారు.

 

ysjagan-chandhrababu
ysjagan-chandhrababu-1
ysjagan-chandhrababu-2
ysjagan-chandhrababu-3

చంద్రబాబు ఉచిత పథకాలు వాగ్ధానాలు చేస్తున్నాడని జగన్ పదే పదే చెబుతున్నాడు. కానీ జగన్ కూడా చేస్తున్న ప్రయోగం అదే కాదా అని సీమాంద్రలోని తలపండిన రాజకీయ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఏం చేశారో తెలుగు ప్రజలకు తెలుసు.

కానీ జగన్ ఇప్పటికే .. రాజకీయ ప్రవేశం చాలా కాలం అయ్యింది. రెండు సార్లు .. ఎంపీ గెలిచి, ఆ ప్రాంత ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేశావో చెప్పలేదు. నాలుగు సంవత్సరాల క్రితం రాజకీయ పార్టీ పెట్టి, ముఖ్యమంత్రి పదవి కోసం నిద్రలేని రాత్రులు గడుపుతూ, ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నావ్? ఇప్పటి వరకు ప్రజలక కోసం నేను ఇది చేశాను అని చెప్పుకునే పరిస్థితి జగన్ లేదనే విషయం తెలుగు ప్రజలందరికి తెలుసునని రాజకీయ మేథావులు అంటున్నారు.

 జగన్ లో బలమైన కోరిక ఒక్కటే.. ‘‘ముఖ్యమంత్రి జగన్ ’’ అనే మాట నీ చెవిన పడేంత వరకు.. నీ రాజకీయ పోరాటం ఆపవని ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ కోసం తెలంగాణ నాయకులు , ప్రజలు, మేథావులు, విద్యార్థులు, ఉద్యోగులు, కళాకారులు, ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొని, రాబోయే తరాల ప్రజలకు భవిష్యత్తు పునాదులు వేయటం జరిగింది.

కానీ జగన్ మాత్రం .. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్నికల పోరాటం చేస్తున్నారు, గానీ తెలుగు ప్రజలకోసం ఎలాంటి పోరాటలు ,ఉద్యమాలు చేయలేదని, రాజకీయ మేథావులు అంటున్నారు. అయితే జగన్ లో మార్పు రావాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles