Lyricist anantha sriram to write voter life songs

Anantha sriram, Lyricist Anantha sriram, voter life song, Anantha sriram to write voter life songs, 2014 election,

Lyricist Anantha sriram to write voter life songs

ఓటేసి నాశనమైపోండి? అనంత శ్రీరామ్

Posted: 04/29/2014 02:51 PM IST
Lyricist anantha sriram to write voter life songs

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని.. సెలబ్రిటీలు చెబుతుంటే.. మన పాటల రచయిత అనంత శ్రీరామ్ మాత్రం ‘‘మీరు ఓటేసి నాశనమైపోండని’’ పాట పడతున్నారు.

ఓటరుకి నా శాపం
ఎరా ఓటెయ్యడానికి ఎల్తన్నావా
ఎల్లు, ఎయ్‌ ఎడికేత్తావో
నాకనవసరం ఎలా ఏత్తావన్నదే నేనడిగేది
బిరియాని పొట్లం తీసుకుని ఓటేత్తావా
బియ్యం గింజ కూడా మిగల్చరు
తాగిన మత్తులో ఓటేత్తావా
తాగుటకు నీటిచుక్కా మిగల్చరు
ఉచిత హామీలకి ఓటేత్తావా
ఉచితంగా చావు కూడా దక్కనివ్వరు
ఆఖరికి అమ్ముడుపోయి ఓటేత్తావా
నిన్ను నీ అమ్మా బాబుల్ని కూడా అమ్మేత్తారు
నువ్వొటేసేది నీ నాయకుడికో ఆడి పార్టీకో కాదు
నీ భవిష్యత్తుకి
హుం నువ్వెందుకు ఆలోచిత్తావ్‌
సిగ్గు సెరం ఉంటే కదా
నిన్నెవ్వడూ బాగు చెయ్యలేడు
ఐపో సర్వనాశనమైపో

- అనంత శ్రీరామ్‌
అంటూ ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్‌ తన కవిత్వంతో ఓటర్లను ఆలోచింప జేస్తున్నాడు. మరి ఈ కవిత్వం చదివిన ఓటర్లు ఓటెయ్యకుండా ఆగిపోతారో లేదా ఓ మంచి నాయకుడిని ఎన్నుకుని వారి తలరాతలు మార్చుకుంటారో లేదా కుళ్లిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో ఎవరైతే ఏంటని అవినీతి పరులకే ఓటేసి శ్రీరామ్‌ చెప్పినట్టు సర్వశానమైపోతారా అని తన పాట ద్వారా ఓటర్లలో ఉన్న రాజకీయ మత్తును వదలిస్తున్నారు.
మన ఓటే మనకు రక్షణ. అనేవిధంగా ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. స్వచ్చమైన నాయకుడ్ని ఎన్నుకోవాలని తన పాట ద్వారా అనంత శ్రీరామ్ చెబుతున్నారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles