Jagan election campaign in kurnool district

Jagan, ys jagan, shobha nagireddy, shobha nagireddy death, Jagan Election Campaign, Jagan Election Campaign in Kurnool, election 2014.

Jagan Election Campaign in Kurnool District

దెబ్బతో-నా పార్టీకి ఓటు వేయకండి? జగన్

Posted: 04/28/2014 01:38 PM IST
Jagan election campaign in kurnool district

వైఎస్ జగన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఒక పక్క నుండి కేసుల సుడిగాలి ..చుట్టుముడుతుంది. మరో పక్క   పార్టీ బలమైన నేత శోభ నాగి రెడ్డి అకాల మరణం.  పార్టీలోని కొందరు సీనియర్ నాయకుల నుండి విమర్శలు ..ఇలా జగన్ కు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయినా   తెలుగు రాష్ట్రంలో.. ఫ్యాన్  ఇంకా స్పీడ్ గా తిప్పాలనే ఉద్దేశంతో.. కుటుంబం సభ్యుల మొత్తం  ఎన్నికల ప్రచారం  సమరంలోకి దిగిన విషయం తెలిసింది.  

సరికొత్తగా రాజకీయల్లోకి వచ్చిన బాలయ్య సైతం ..జగన్ పార్టీ పై విమర్శలు చేయటం  ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు.  అప్పటికే  జగన్ వదిలిన బాణం.. బాలయ్య పై విరుచుపడిన  ఫలితం లేకుపోయిందని.. ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

అయితే జగన్ గెలుపు గుర్రాలైన ఒక శోభ నాగిరెడ్డి మరణంతో.. కర్నూల్ జిల్లా.. ఆళ్లగడ్డలో  నియోజక వర్గం ప్రజలకు  ‘నా పార్టీకి ఓటు వేయకండి  అని చెప్పాల్సిన అవసరం కలిగింది’.  దీంతో  అక్కడ జగన్ పార్టీకి  గట్టి చిక్కే వచ్చి పడింది.  ఆ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న శోభానాగిరెడ్డి మరణంతో ఆమె పేరు ఈవీఎంలో ఉన్నా.... ఫ్యాన్ గుర్తు ఉన్నా ఆ గుర్తుకు ఓటు వేయడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. 

ఎలక్షన్ చీఫ్ బన్వర్ లాల్ మీడియా ప్రకటన ద్వారా ఆల్లగడ్డలో ఫ్యాన్ గుర్తుకు వేయ్యోద్దని తెలిపారు. వైఎస్సార్సీ  ఇంకా ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందలేదు. అందువల్ల మరో అభ్యర్ధిని నియమించుకునే అవకాశంలేదు. ఈ కారణగా వాళ్లు స్వతంత్ర అభ్యర్ధుల్లో ఎవరో ఒకర్ని ఎంపిక చేసుకుని ఆ అభ్యర్ధి గుర్తుకు ప్రచారం చేసుకోవలసిందేనని అధికారులు అంటున్నారు. ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ఇదే విషయాన్ని చెబుతూ శోభానాగిరెడ్డి మరణం దృష్ట్యా, 'ఫ్యాన్' గుర్తుకు వేసే ఓట్లు చెల్లవన్నారు. 

అంతేకాకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఆ ఓటు ను నోటా క్రింద పరిగణిస్తామని చెప్పారు. అంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తమ పార్టీ గుర్తుకు ఓటు వేయవద్దని ఈ పార్టీవారే చెప్పుకోవలసిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అది నాయకత్వం మా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకండని చెబుతున్నట్లు సమాచారం. 

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles