Balakrishna assures victims of alliance

Balakrishna assures victims of alliance, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Balakrishna assures victims of alliance

తన భవితే తనకు తెలియని బాలయ్య హామీలు

Posted: 04/07/2014 01:48 PM IST
Balakrishna assures victims of alliance

తెలుగు దేశం పార్టీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటున్న పొత్తు వలన సీట్ల అడ్జస్ట్ మెంట్ లో సొంత పార్టీలో కొందరికి నష్టం జరగటమైతే ఖాయం.  అటువంటివారికి తగు న్యాయం జరుగుతుందని చెప్తున్నది పార్టీ అధినాయకుడు కాదు, తన సీటెక్కడో తనకే తెలియని బాలకృష్ణ.  తన రాజకీయ భవితే తనకు తెలియని బాలయ్య మాకు ఏం చెయ్యగలడు అని తమలో తామే అనుకుంటున్నారు అందులో కొందరు నాయకులు.

లెజెండ్ చిత్రం విడుదలైన తర్వాత వరుసగా నారసింహుని ఆలయాలను సందర్శిస్తున్న నందమూరి బాలకృష్ణ ఈరోజు ఉదయం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. 

ఆ తర్వాత బాలయ్య తనను చూడటానికి వచ్చిన సినీ రాజకీయ అభిమానులు, తెలుగు దేశం పార్టీ నాయకులతో ముచ్చటించారు.  తన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమని చెప్తూ వచ్చిన బాలయ్య తను ఎక్కడి నుండి పోటీ చెయ్యాలన్నదానిలో ఇంకా స్పష్టత రాలేదని అన్నారు.

తెదేపా భాజపాల పొత్తు విషయంలో మాట్లాడుతూ, పొత్తు వలన ఇరు పార్టీలకు లాభం చేకూరుతుందన్న ఉద్దేశ్యంలోనే పొత్తు పెట్టుకోవటం జరిగింది.  అయితే సీట్ల అడ్జస్ట్ మెంట్ల విషయంలో కసరత్తు ఇంకా పూర్తి కాలేదని,  ఈవిషయంలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందని అనిపిస్తే, రాజకీయ రంగంలో అందుకు తగ్గ నష్టపరిహారంగా వారికి సర్దుబాటు జరుగుతుందని హామీ ఇచ్చారాయన. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles