Man threw ink on kejriwal became supporter

Man threw ink on Kejriwal became supporter, Nachiketa Walnekar threw ink on Arvind Kejriwal, Nachiketa Walnekar joins AAP, Bharatiya Janata party, Aam Admi Party

Man threw ink on Kejriwal became supporter

బురద చల్లి బంధువైన నచికేతుడు

Posted: 04/05/2014 10:12 AM IST
Man threw ink on kejriwal became supporter

2013 నవంబర్ లో ఆఆపా నాయకుల మీద సిరా చల్లిన నచికేత వల్నేకర్ ఢిల్లీ లో త్రిలోక్ పురిలో ఆఆపా నాయకులతో వేదికను పంచుకున్నారు.  విచిత్రంగా ఉంది కదూ.  కాని ఇది నిజం.  అలా జరిగిందంటే మార్పు ఆఆపా లో వచ్చిందా లేకపోతే నచికేత లోనా అని చూస్తే నచికేతలోనే అని తెలుస్తోంది.  ఎందుకంటే ఆఆపా లో చేరటానికి కొద్ది కాలం క్రితమే అతను తను చేసిన పనిని గుర్తు చేసి మరీ అందుకు క్షమాపణ కోరుకున్నారట. 

మహారాష్ట్ర కు చెందిన నచికేత వల్నేకర్ భారతీయ జనతా పార్టీలో పనిచేసేవారు.  రాజకీయాల కోసం అన్నాహజారేకి ద్రోహం చేసారన్న అభియోగంతో నచికేత ఆఆపా లో అరవింద్ కేజ్రీవాల్ మరి ఇతర నాయకుల మీద ఇంక్ చల్లి తన నిరసనను ప్రదర్శించారు. 

అయితే, ఇప్పుడు ఆఆపా లో చేరటం వలన భాజపాలోని లొసుగులన్నిటినీ బహిర్గతం చేస్తానని అంటున్నారు.  త్రిలోక్ పురిలో నచికేతను పరిచయం చేస్తూ, భాజపా అసలు స్వరూపాన్ని బయటపెట్టటానికి ఆయన ఆఆపా కి ఉపయోగపడతారని ఆఆపా నాయకుడు అన్నారు.  ఈ ప్రకటన ఆఆపాలో కొందరికి మింగుడుపడలేదు. 

నచికేత తన గురించి చెప్తూ తాను మొదటి నుంచి విప్లవకారుడినేనని, ఎప్పుడూ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తున్నానని, ఈ విషయంలో భాజపాకి సరైన దృష్టికోణముందని భ్రమించి 2008 లో భాజపాలో చేరానని, కానీ తనకు తగ్గ హోదా అందులో దక్కలేదని, తాను సిరా పోసినా తనను క్షమించిన అరవింద్ కేజ్రీవాల్ గొప్పతనం తనకు బాగా నచ్చిందని, హృదయానికి బాగా హత్తుకుందని, పైగా తనో కూడని పార్టీలో చేరాడని వాళ్ళ అమ్మ కూడా చెప్పిందని, తను నిర్దేశం సరిగా లేని యువకుడవటం వలన తన వలన పొరపాటు జరిగిందని ఢిల్లీ వచ్చి క్షమాపణ చెప్పుకున్నానని, ఇక ఆఆపా లో చేరి ప్రజాసేవ చేస్తానని అన్నారు.  తను కేజ్రీవాల్ మీద నల్ల రంగు వేసిన ఉదంతాన్ని మరో సారి గుర్తు చేసుకుంటూ అందుకు తాను జీవితాంతం పశ్చాత్తాపపడుతూనేవుంటానని అన్నారు నచికేత.  కేజ్రీవాల్ ని పాకిస్తాన్ ఏజెంట్ అని అన్న భాజపా మీద తన ఆగ్రహాన్ని ప్రదర్శించారాయన. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles