Bhanwarlal asks for details of various committees created in ap state

Bhanwarlal asks for details of committees, Committes created by Govt in state bifurcation, State Election Officer Bhanwarlal, Committee on new capital

Bhanwarlal asks for details of various committees created in AP State related to bifurcation process

కమిటీలను ఎవర్నడిగి వేసారు?- భన్వర్ లాల్

Posted: 04/02/2014 10:07 AM IST
Bhanwarlal asks for details of various committees created in ap state

రాష్ట్ర విభజన దృష్ట్యా వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్లుగా ఫిర్యాదులు అందాయని అన్న రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అవి ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు.

వివిధ కమిటీలను నియమించిన ప్రభుత్వాన్ని వివరాలను ఇవ్వమని కోరామని, వాటిని ఎప్పుడు నియమించారు, ఏ పనికి నియమించారన్నది తెలిస్తేనే కాని దాని గురించి ఏమీ చెప్పలేమని, ఆ వివరాలు ప్రభుత్వం నుంచి అందిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను పంపుతామని, భన్వర్ లాల్ అన్నారు.

సీమాంధ్ర రాజధాని కోసం ఒక కమిటీ, ప్రభుత్వ ఉద్యోగలు, పోలీసు శాఖల విభజనలకు మరిన్ని కమిటీలు, పోలవరం ప్రాజెక్ట్ ఇంకా ఇతర రాష్ట్ర విభజనతో సంబంధమున్న విషయాలమీద ఎన్నో కమిటీలను వెయ్యటం వలన కొన్ని ప్రాంతాల మీద దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఎన్నికలు స్వచ్ఛందంగా జరగటానికి అవి అడ్డు పడతాయి కాబట్టి ఆ విషయంలో ఎన్నికల కమిషన్ వాటి పూర్వాపరాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles