Bjp candidate hiralal objectionable comments

BJP candidate Hiralal objectionable comments, Congress party, Bharatiya Janata Party, Pawan Kalyan Janasena party

BJP candidate Hiralal objectionable comments

బట్టలూడదీసి ఇటలీకి పంపిస్తా- భాజపా అభ్యర్థి

Posted: 04/01/2014 10:43 AM IST
Bjp candidate hiralal objectionable comments

బహిరంగ సభల్లో మైకు పట్టుకుని సభికులకు అభిముఖంగా మాట్లాడటం మొదలుపెట్టగానే రెచ్చి పోయే స్వభావంతో మొన్న సహరన్ పూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ మోదీ మీద నోరు పారేసుకుంటే భాజపా దాని మీద రాద్ధాంతం చేసింది.  అది మసూద్ అరెస్ట్ వరకూ దారితీసింది.  

ఇదేమైనా కనువిప్పు కలిగిస్తుందా అంటే అబ్బే అలాంటిదేమీ లేదంటున్నారు రాజస్తాన్ లో టోంక్ నియాజకవర్గంలో భాజపాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికలలో పోటీ చేస్తున్న హీరాలాల్.  ఎన్నికల ప్రచారంలో ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్న హీరాలాల్, సోనియా రాహుల్ బట్టలూడదీసి ఇటలీ తరిమేస్తానంటూ వ్యాఖ్యానాలు చేసి రాద్ధాంతం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకిచ్చారు.  

హీరాలాల్ మీద ఎన్నికల కమిషన్ కి ఆరోపణలు చేరటంతో, అబ్బెబ్బే నా ఉద్దేశ్యం అది కాదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంటున్నారు- అయినా క్షమాపణలు కోరుతున్నానంటూ ప్రకటించారు హీరాలాల్.  స్పష్టంగా మాట్లాడుతూ నా ఉద్దేశ్యం అది కాదనటంలో ఏమిటి అర్థమంటూ కాంగ్రెస్ నాయకులు భాజపా మీద మండిపడుతున్నారు.  తమ పార్టీ అధిష్టానానికి ఆనందాన్నిద్దామనుకుంటారో లేకపోతే ఎన్నికల ప్రచారంలో

ప్రసంగమంటే వైరి పార్టీ నాయకుల మీద వ్యంగ్య వ్యాఖ్యానాలు చెయ్యటమే అని అనుకుంటారో కానీ, లేదంటే మీడియా కవరేజ్ బాగా జరగాలంటే అగ్ర నాయకులను ఘాటుగా విమర్శించటం, హెచ్చరించటం చెయ్యాలనుకుంటారో కానీ, కొందరు నాయకులు బహిరంగ సమావేశాల్లో కాసేపు తమ స్పృహనే కోల్పోతారు.  

అంటే, నిజానికి వాళ్ళ ఒంటిమీద బట్టలున్నాయో లేదో కూడా వాళ్ళకి తెలియదంటూ విశ్లేషకులు అంటున్నారు.  

ఉద్రేకం ఉద్వేగంతో మాట్లాడే పవన్ కళ్యాణ్ కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అలాగే మాట్లాడారు.  అయితే ఈ మధ్యకాలంలో తన తప్పు తెలుసుకున్నట్లున్నారు, జనసేన పార్టీ ఆవిర్భావ సభలోను, ఆ తర్వాత పార్టీ తరఫున జరిగిన మొదటి సభలోనూ ఆయన ఎవరినీ కించపరచే విధంగా సంబోధించకపోవటం విశేషం.  ఆయన, గారు అంటూ మర్యాదగా మాట్లాడటం, తెలుగురాని నాయకుల కోసం ఇంగ్లీషులో హెచ్చరికలు జారీ చేసినా వాళ్ళనిమిస్టర్, మిసెస్ అంటూ గౌరవపూర్వకంగా సంబోధించారు పవన్ కళ్యాణ్.

ఏది ఏమైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యకపోవటం సర్వత్రా క్షేమదాయకం కదూ!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles