Comedian venu madhav speech in tdp

comedian venu madhav speech in TDP prajagarjana, Venu Madhav comments on Rahul Gandhi, Venu Madhav comments on Jagan, Venu Madhav comments on Sharmila

comedian venu madhav speech in TDP prajagarjana

రాహుల్ ప్రధానమంత్రి కాడు, పెళ్ళీ కాదు- వేణుమాధవ్

Posted: 03/26/2014 08:15 AM IST
Comedian venu madhav speech in tdp

మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న తెలుగు దేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోపాటు పాలమూర్ రోడ్ షో లో పాల్గొన్న హాస్యనటుడు వేణు మాధవ్ తన మాటలతో ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించారు.  పెళ్ళికాని రాహుల్ గురించి మాట్లాడుతూ, ఆయన ప్రధాన మంత్రి కాడు, ఆయనకి పెళ్ళీ కాదు అంటూ ఛలోక్తులతో నవ్వించారు.  పెళ్ళి కావాలీ అంటే రాహుల్ గాంధీ టిడిపిలో చేరాలని, మహబూబ్ నగర్ రావాలని, ఇక్కడే ఒక అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తామని అన్నారు వేణు మాధవ్. 

రాహుల్ గాంధీతోపాటు వేణు మాధవ్ జగన్, షర్మిలాల మీద కూడా వ్యంగ్య బాణాలను సంధించారు.  ఒకామె తాను బాణమని అంటోందని షర్మిలను, కారెక్కి ఇంటికి తీసుకుపొమ్మంటే డ్రైవరేమో జైలుకి తీసుకుపోయాడని జగన్ మీద వేణు మాధవ్ తనదైన హాస్య ధోరణిలో విమర్శలు గుప్పించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

తెలుగుదేశంలో చేరిన వేణుమాధవ్ పార్టీ టికెట్ మీద ఎన్నికలలో పోటీ చేద్దామని ఆశిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles