Kejriwal contesting from varanasi against modi

Kejriwal contesting from Varanasi against Modi, Aam Admi Party, Arvind Kejriwal, Bharatiya Janata Party, Narendra Modi, Delhi MLAs, AAP to campaign from Varanasi

Kejriwal contesting from Varanasi against Modi, Aam Admi Party, Arvind Kejriwal, Bharatiya Janata Party, Narendra Modi, Delhi MLAs, AAP to campaign from Varanasi

రామ్ తేరీ గంగా మైలీ- కేజ్రీవాల్

Posted: 03/26/2014 10:07 AM IST
Kejriwal contesting from varanasi against modi

గంగానది కలుషితమైందంటూ దాన్ని ప్రక్షాళన చెయ్యటం అవసరమంటూ కేజ్రీవాల్ ఆవేదనను వ్యక్తపరచారు.

వారణాసిలో భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ కి పోటీగా ఎన్నికలలో నిలబడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వాహకుడు అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం వారణాసి లో అడుగు పెట్టి అడుగడుగునా నిరసనలు ఎదుర్కుంటూ గంగలో మునకలు వేసారు, కాశీ విశ్వనాధుని సందర్శించారు.  ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు, సిరాలను మీద వేసినా పట్టించుకోకుండా రోడ్ షో కి వెళ్ళారు. 

పోటీ చేసేది జాతీయ స్థాయిలోనైనా, కేజ్రీవాల్ తను పోటీ చేస్తున్న ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించటం మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు.  గంగానది కాలుష్యం, మురుగు నీరు, చేనేత కార్మికుల సమస్యలనే ప్రధానంగా తీసుకున్నారు. 

ఆఆపా ముఖ్యనాయకులు గోపాల్ రాయ్, సంజయ్ సింగ్ నేతృత్వంలో వారణాసిలో ఆఆపా ఎన్నికల ప్రచారం సాగబోతోంది.  వారికి సాయంగా ఢిల్లీ యుపి లలోని యువత నడుంకట్టింది. 
ఢిల్లీ లోని మాజీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు వారణాసికి మకాం మార్చి ఎన్నికలయ్యేంత వరకు వారణాసిలోనే మకాం వేస్తారని సమాచారం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles