Jairam ramesh begging around in andhrapradesh

Jairam Ramesh, congress party, Seemandhra, Karnataka, Jairam Ramesh begging around in andhrapradesh, 2014 election, Seemandhra people, telangana people.

Jairam Ramesh begging around in andhrapradesh

తెలుగు రాష్ట్రాల్లో పరువుగా బిచ్చమెత్తుకుంటున్న జైరాం రమేష్ ?

Posted: 03/13/2014 11:46 AM IST
Jairam ramesh begging around in andhrapradesh

అవును మీరు చదివింది అక్షరాల సత్యం. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. రాష్ట్ర విభజన సయమంలో సోనియా గాంధీకి నాలుకైనే జైరాం రమేష్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయరైంది.   ఏ ప్రజలను చూసి వెకిలిగా నవ్వులు నవ్వి, గోవిందా. గోవిందా అన్నాడో.. ఆ ప్రజల వద్దకు జోలి పట్టుకోని తిరుగుతున్నాడు.  

సహజంగా  పొట్టపొసుకోవటానికి  బిచ్చమెత్తుకుంటారు.  కానీ ఈ జైరాం  రమేష్  మాత్రం  తన రాజకీయ భవిష్యత్తు కోసం  బిచ్చమెత్తుకుంటున్నారు. అదీ కూడా  తెలుగు రాష్ట్రాల్లోనే  బిచ్చమెత్తుకోవటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే.. ఆయనకు  రాజకీయ భవిష్యతు ఉండాలంటే.. తెలుగు ప్రజలే ఆయనకు బిచ్చమెయ్యాలి.   

పంచాయితీ వార్డు మెంబర్ కూడా గెలవలేని  జైరాం రమేష్ , తమిళనాడు, కేరళ,  కర్ణాటక, ఆంద్రప్రదేశ్ ప్రజల ఓట్ల లతో గెలిచి , కేంద్రం లో చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే.  రెండు రాష్ట్రాలకు ఎన్నికల జరుగుతున్న సమయంలో  జైరాం రమేష్  సుడిగాలి పర్యాటన చేయటమే  ఇందుకు  నిదర్శమని  రాజకీయ మేథావులు అంటున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న జైరాం రమేశ్ అటు సీమాంధ్రలో పర్యటిస్తూ సీమాంధ్ర ప్రజలకు రాష్ట్ర విభజన వల్ల కలిగే ప్రయోజనాలను ఊదరగొట్టి చెబుతున్నారు. ఇక తెలంగాణలో తిరుగుతూ తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలంటూ బతిమాలుతున్నారు.

పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనందుకు టిఆర్ఎస్‌ను, ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ను, కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తిట్టిపోస్తున్నారు. 

కేంద్రం నుంచి పార్టీ ఇన్‌చార్జిగాని, ఇతర కేంద్ర మంత్రులు కాని రాకుండా జైరాం రమేశ్ మాత్రమే రాష్ట్రంలో ఎందుకు గాలిపటంలా చుట్టేస్తున్నారన్న సందేహం కాంగ్రెస్ నాయకులలో కూడా కలుగుతోంది. మళ్లీ కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో తనను తాను బిజీగా ఉంచుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో కాని విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో కాని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పదవి దక్కించుకోవాలని జైరాం ఆశపడుతుండవచ్చన్నది కొందరి అభిప్రాయం.  

అయితే.. ఈ రెండు రాష్ట్రాలలో ఏదో ఒక దాని నుంచి తన రాజ్యసభ సభ్యత్వాన్ని మరో పర్యాయం పొడిగించుకోవాలని జైరాం ఆలోచిస్తుండవచ్చన్నది కొందరి సందేహం.అయితే జైరాం రమేష్ మాటలను, ఆయనను  తెలంగాణ ప్రజలు గానీ, తెలంగాణ నాయకులు గానీ నమ్మే పరిస్థితి లేదు.

ఎందుకంటే  కలిసి ఉన్న తెలుగు జాతిని  రెండుగా  విడిపోవటంలో జైరాం రమేష్ పాత్ర చాల ముఖ్యమైనదని అందరి తెలుసు. ఇక సీమాంద్ర  ప్రజలు అయితే.. జైరాం రమేష్ నీడను  సైతం వారు సహించలేకపోతున్నారు. సీమాంద్ర నాయకులు కొంతమంది ఆయన పాదాలకు  గులాబీ  షేకం చేస్తున్నారు. 

ఇప్పటికే జైరాం పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో తిరుగుతూ  తల , తోక లేని రాజకీయ ప్రకటనలు  చేస్తూ పబ్బం గడుపుకుంటున్న జైరాం పై సోనియా అక్షింతాలు వేసినట్లు  ఢిల్లీ పెద్దలు అంటున్నారు.

ఇక ఇరుప్రాంతాల  నాయకులైతే.. జైరాం పై  మాటల యుద్దం చేస్తున్నారు. మొన్న తెలంగాణ నేత  హరీష్ రావు. జైరాం రమేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని  వార్నింగ్ ఇవ్వటం జరిగింది,  నిన్న మాజీ ముఖ్యమంత్రి  జై సమైక్యాంద్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జైరా రమేష్  ఒక పిచ్చి మేథావి  అని కామెంట్ చేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు తెలుగు ప్రజలు  జైరాం రమేష్ కు రాజకీయ బిచ్చం పెడతారో, లేక తన్ని , తరిమేస్తారో  చూడాలి. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles