Rakhi sawant makes bjp her birth place

Rakhi Sawant makes BJP her birth place, Narendra Modi, Rahul Gandhi, Rakhi Sawant item girl, BJP PM Candidate Modi, Congress PM candidate Rahul Gandhi

Rakhi Sawant makes BJP her birth place, Narendra Modi, Rahul Gandhi

మోదీని మామను చేస్తున్న భామ

Posted: 03/02/2014 10:52 AM IST
Rakhi sawant makes bjp her birth place

శనివారం నాడు ఐటం బాంబ్ రాఖీ సావంత్ న్యూఢిల్లీ లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్ళి హల్ చల్ చేసింది.  తాను భాజపా పుత్రికనని చెప్పుకొచ్చిందామె.  అంతేకాదు కన్నపార్టీ ఋణం తీర్చుకోవటం కోసం ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీ ఎన్నికలలో విజయం సాధించాలని, ప్రధానమంత్రి గద్దెక్కాలని తన అభిలాషను తెలియజేసింది. 

పార్టీలో చేరుతావా అన్న ప్రశ్నకు, ఆ విషయం తనకు తెలియదని, తనను ఎలా వాడుకోవాలో పార్టీ సీనియర్ నాయకులకే బాగా తెలుసని ఆ నిర్ణయాన్ని వాళ్ళే తీసుకుంటారని అందామె.  తను కేవలం పుట్టిల్లులా భావించి పార్టీ ఆఫీసుకి వచ్చానందామె. 

అయితే కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీని పెళ్ళి చేసుకోవటానికి తాను సిద్ధమని చెప్తూనే ఆయన ప్రధాని మంత్రి కావాలన్న తన కోరికను కూడా వెలిబుచ్చింది రాఖీ సావంత్. 

ఇందులో రాఖీ సావంత్ ని తప్పుపట్టాల్సిందేమీ లేదు.  పెళ్ళిచేసుకోబోయే మనిషికీ పుట్టింటికీ కూడా మంచి జరగాలనే కోరుకుంటూ వాళ్ళిద్దరి ఘర్షణ మధ్యలో నలిగిపోతున్న పాత్రలో రాఖీ సావంత్ చక్కగా ఒదిగిపోయింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles