Tdp party leaders jump to congress party

tdp, congress party, 2014 election, tdp party leaders jump to congress party, chandrababu naidu, telagana tdp leaders.

tdp party leaders jump to congress party

'సైకిల్ వద్దు.. ' చెయ్యే ముద్దంటున్న సీనియర్ లీడర్?

Posted: 03/01/2014 02:19 PM IST
Tdp party leaders jump to congress party

రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచుతున్నారు.  2014 ఎన్నికల్లో  గెలిచే గెలుపు గుర్రాల కోసం వేట సాగిస్తున్నారు.  చంద్రబాబు స్పీడ్ గా, చుర్గుగా  పార్టీ కార్యక్రమాలు చేస్తున్నా సమయంలో.. పార్టీలోని  అసంత్రుప్తి నేతలు గోడలు దూకుతున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు పసుపు పచ్చ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. 

టిడిపి రాజ్యసభ సభ్యత్వాన్ని నిరాకరించిననాటి నుంచి పార్టీలో సంతోషంగా లేని నరసింహులు తన తదుపరి రాజకీయ అడుగు గురించి మద్దతుదారులు, శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటున్నట్లు సమాచారం.

అంతా అనుకూలిస్తే పాలక పక్షం సభ్యునిగా ఆయన కొత్త అవతారం ఎత్తవచ్చు. అయితే తాను టిడిపిని వీడుతున్నట్లు నరసింహులు ఇప్పటిదాకా ఎక్కడా బహిరంగంగా చెప్పనప్పటికీ కె.జానారెడ్డి లాంటి కొందరు తెలంగాణ కాంగ్రెస్ కీలక నాయకులు టిడిపి సీనియర్ నాయకుడు పాలక పక్షంలో చేరేలా ఏఐసీసీ నాయకత్వానికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీలోకి నరసింహులు చేరికతో తెలంగాణలో ఎస్సీల హృదయాలను పార్టీ కొంత మేరకు గెలుచుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దాంతో ఆయన చేరిక అంశాన్ని ఏఐసీసీ నాయకత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది. వాస్తవానికి, టిడిపి తరఫున రాజ్యసభ సీటును పొందడంలో విఫలమైన మోత్కుపల్లి వెనువెంటనే.. తాను టిడిపిలో కొనసాగడానికి ఎలాంటి కారణం కనిపించడంలేదని ప్రకటించే దాకా వెళ్ళారు. 

అయితే టిడిపి నాయకత్వం అదేపనిగా బుజ్జిగించడంతో పార్టీని వీడే ఆలోచనను సీనియర్ దళిత నాయకుడు విరమించుకున్నారు. తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం, తెలంగాణ ప్రక్రియను ఆపడానికి టిడిపి అధినేత చంద్రబాబు 'బాహటంగా ప్రయత్నాలు' చేయడంతో పసుపు పచ్చ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో మోత్కుపల్లి ఉన్నట్లు  విశ్వసనీయ వర్గాల సమాచారం.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles