Chandrababu happy moment

Chandrababu Happy Moment, nara chandrababu naidu, tdp chief chandrababu naidu, congress party, tdp, 4 state election results, bjp, ap bifurcation, chandrababu fire on congress party, 2014 election,

Chandrababu Happy Moment

చంద్రబాబులో నూతన ఉత్సాహం

Posted: 12/09/2013 12:11 PM IST
Chandrababu happy moment

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లో నూతన ఉత్సాహం కనిపిస్తుందని టిడిపి వర్గాలు అంటున్నాయి. నిన్నటి వరకు రాష్ట్ర విభజన పై, ప్రజా సమస్యల పై క్షణం తీరికలేకండా తిరిగి అలసి పోయిన చంద్రబాబు లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. తొమ్మిదేళ్ల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న కల.. ఈసారి నేరవేరుతుందనే ఆశ ఆయనలో కనిపిస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర విభజన పై రెండు కళ్ల సిద్దాంతాన్ని అవలంబించిన చంద్రబాబు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు కురిపిస్తున్నారు. సమన్యాయం పాటించకుండా .. రాష్ట్ర విభజన చేసిందని కాంగ్రెస్ పార్టీపై, సీమాంద్ర కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే రాష్ట్ర విభజన పై దూకుడుగా వెళ్లుతున్న కాంగ్రెస్ హైకమాండ్ కు కళ్లే పడే సమయం ఉందని టిడిపి వర్గాలు అంటున్నాయి.

 

ఇటీవల ఢిల్లీ, రాజస్థాన్, మద్యప్రదేశ్, చత్తీస్ ఘాడ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే నిన్న ఆ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీని కుంగతీశాయి. నాలుగు రాష్ట్రాల్లో .. కాంగ్రెస్ పార్టీని ప్రజలు చుక్కలు చూపించారు. నాలుగు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఊడ్చేసారు.ఎన్నికల ఫలితాలు అధికారపార్టీని దెబ్బతీసాయి. ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ హైకమాండ్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. నాలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ కి వచ్చిన ఎన్నికల ఫలితాల పై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వివరణ ఇచ్చుకోవటం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం ఆనందంలో మునిగితెలిపోతున్నారు. మోడీ ప్రభావం కనిపిస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు సంబారాలు చేస్తున్నారు.

 

నాలుగు రాష్ట్రాల్లో బీజెపికి అనుకూలంగా మారటంతో.. సైకిల్ గుర్తు చంద్రబాబు ఆనందపడుతున్నారు. బాబు కు కమలం గుర్తు నాయకులతో ఉన్న సన్నిహతమే ఆయన ఆనందానికి కారణమని టిడిపి వర్గాలు అంటున్నాయి. 2014 ఎన్నికల్లో తమ అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు అంటున్నారు. మొత్తం మీద లగడపాటి జోష్యం చెప్పినట్లు నాలుగు రాష్ట్ర ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసాయి. ఇక మనదగ్గర కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles