Venkaih Naidu said Its essential to get special status for ap

Venkaih naidu said its essential to get special status for ap

AP, Special status, Venkiah naidu, chandra Babu naidu, Special status for ap, Parliament, Venkiah Naidu on special status

Central Minister Venkiah naidu said that its very essential to get special status for andhrapradesh. In the parliament he deviler his expressions on special status for ap.

ఏపికి ప్రత్యేక హోదా రావాల్సిందే: వెంకయ్య నాయుడు

Posted: 11/27/2015 01:19 PM IST
Venkaih naidu said its essential to get special status for ap

ఏపికి ప్రత్యేక హోదా పై మరోసారి పార్లమెంట్ వేదికగా ఓ గళం వినిపించింది. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఏపికి ప్రత్యేక హోదా రావాల్సిందేనని పార్లమెంట్ లో అందరి సమక్షంలో వెల్లడించారు. ఏపీకి రెవెన్యూ లోటు ఉన్నందునే హోదా కావాలని ప్రజలు కోరుతున్నారని, అలా కోరుతున్నవారిలో తాను కూడా ఉన్నానని స్పష్టం చేశారు. హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన సాగుతుందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని వెల్లడించిన ఆయన, ఏపీ అభివృద్ధికి, విభజన హామీల అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాను అడుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన, మరెన్నో రాష్ట్రాలు అదే డిమాండ్ ను తెరపైకి తెస్తున్నాయని తెలిపారు. ఈ విషయంలో పట్టుదలకు పోకుండా, దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కాగా గత కొంత కాలంగా ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. తెలుగు వారికి తన వంతు సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తానని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ముందు నుండి కూడా అంటున్నారు. తాజాగా మరోసారి పార్లమెంట్ వేదికగా వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా మీద మాట్లాడటంతో ఏపిలో ప్రజలకు కొత్త భరోసా లభిస్తుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more