Vemana Sathakam in Telugu 29552 Vemana Satakalu

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu నేరనన్నవాడు Vemana satakam

Get the Vemana Sathakam తనకి అన్నీ తెలుసని బరిలోకి దూకినవాడు ఎప్పుడైనా బెడిసికొట్టినట్టయితే, మాటపోగొట్టుకునే అవకాశం ఉంది, నింద భరించవలసి రావొచ్చు అందుకే, నాకేం రాదు అని చెప్పేవాడు అతనికంటే తెలివైనవాడు. In Telugu Vemana Satakalu

వేమన శతకం 34

Posted: 11/29/2011 06:27 PM IST

vemana34

నేరనన్నవాడు=తనకు రాదు అని అనేవాడు, నెరజాణ=మంచి నేర్పరి, మహిలోన=ప్రపంచంలో, నేర్తునన్నవాడు=అన్నీ తెలుసన్నవాడు, నిందజెందు=అపకీర్తిపాలవుతాడు, ఊరకున్నవాడు=మౌనం పాటించేవాడే, ఉత్తమ యోగి=గొప్ప యోగి.

తనకి అన్నీ తెలుసని బరిలోకి దూకినవాడు ఎప్పుడైనా బెడిసికొట్టినట్టయితే, మాటపోగొట్టుకునే అవకాశం ఉంది, నింద భరించవలసి రావొచ్చు అందుకే, నాకేం రాదు అని చెప్పేవాడు అతనికంటే తెలివైనవాడు. ముందే ఏమీ రాదని అన్నవాడిని ఎవరూ తప్పుపట్టరు. అంతకంటే తెలివైనవాడు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడు. ఎటువంటి వాగ్దానాలు, హామీలు ఇవ్వని వారు, గుంభనంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ పోయేవారు నిజంగా ఘనులు.

యోగి అన్న పదానికి ఇక్కడ సన్యాసో బైరాగో అని కాదు. జీవితంలో సమతౌల్యతను పాటిస్తూ ఎవరి మెప్పూ ఆశించకుండా ఎక్కడా ఎలాంటి ప్రగల్భాలు పలకకుండా జీవితాన్ని సాఫీగా నడిపేవాడు యోగి. భగవద్గీతలో యోగి లక్షణాలను వివరించిన శ్రీకృష్ణుడు చివరగా, అందువలన నీవు యోగి అవు అర్జునా అంటాడు. యోగికి మౌనం పెద్ద ఆయుధం.

మనం మాట్లాడటానికి ఎంతో శక్తిని ఉపయోగిస్తాం. కేవలం మాట బయటకు రావటానికి ఉపయోగించే ఊపిరే కాదు, భాషను గుర్తు చేసుకోవాలి, చెప్పదలచుకున్న బావానికి సరిపడే పదాలను ఎన్నుకోవాలి, వ్యాకరణం పాటించాలి, మాటల్లో సొంపు ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎదుటివారికి అది అర్థమయ్యేలా ఉండాలి, వారు మెచ్చేదిగా ఉండాలి. ఏ ఉద్దేశ్యంతో ఆ పలుకులు పలికామో ఆ ఫలితం వచ్చేదిగా ఉండాలి. ఇవన్నీ ఆలోచించటానికి కూడా శక్తి వినియోగమవుతుంది. ఇంతా చేసి మాట్లాడిన తర్వాత ఆశించిన ఫలితం లేకపోతే నిరాశ, ఫలితముంటే ఆనందంతో గంతులువేయటం ఇవన్నీ కూడా శక్తిని హరించేవే. తన శక్తిని పదిలంగా ఉంచుకుంటూ, ఇంకా పెంచుకుంటూ, ఆచితూచి ఖర్చు పెట్టేవాడే నిజమైన యోగి. అవసరమైనప్పుడు తప్పకుండా మాట్లాడుతాడు యోగి!

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

 
Vemana sathakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more