Vemana Sathakam in Telugu 29489 Vemana Satakalu

Vemana Sathakam, Vemana Satakalu, Telugu Satakalu, Vemana Satakalu in Telugu నిక్కమైన నిజమైన Vemana satakam

Get the Vemana Sathakam రంగురాళ్లు, గులకరాళ్ళు తట్టలకొద్దీ పోగుచేసుకున్నదానికంటే ఒక్క మంచి జాతి రాయి ఉంటే చాలు కదా, అలాగే మనసు రంజింపజేసే సత్యాన్ని వెల్లడించే పద్యం ఒక్కటే చాలు In Telugu Vemana Satakalu

వేమన శతకం - 33

Posted: 11/26/2011 02:30 PM IST

vemana33

నిక్కమైన=నిజమైన, మంచి నీలము=ఇంద్రనీల మణి, ఒక్కటి చాలు=ఒక్కటే చాలు, తళుకుబెళుకు రాళ్ళు=రకరకాల రంగు రాళ్ళు, తట్టెడేల=తట్టడెందుకు, చాటుపద్యం=అందరికీ ఇష్టం కలిగించే చక్కని పద్యం, ఇలను=భూమ్మీద, ఒక్కటి చాలదా= ఒక్కటి సరిపోతుంది కదా!

రంగురాళ్లు, గులకరాళ్ళు తట్టలకొద్దీ పోగుచేసుకున్నదానికంటే ఒక్క మంచి జాతి రాయి ఉంటే చాలు కదా, అలాగే మనసు రంజింపజేసే సత్యాన్ని వెల్లడించే పద్యం ఒక్కటే చాలు

మనిషి ఎప్పుడూ ఏదో ఒకటి పోగుచేసుకుంటూనేవుంటాడు. చిన్నప్పుడు పోగు చేసుకునే వస్తువులు వేరు. పెద్దవుతున్నకొద్దీ, లోకఙానం పెరుగుతున్నకొద్దీ పోగుచేసుకునే వస్తువులలో తేడా ఉంటుంది కానీ పోగుచేసుకునే లక్షణం మాత్రం పోదు. చీమలు ఏది బడితే అది పోగుచేసుకుంటాయి, కానీ తేనెటీగ ఎన్ని చోట్లకి తిరిగినా తేనె తప్ప మరేమీ పోగుచేసుకోదు. అలాగే పనికిరాని సాహిత్యం చదివేదానికంటే ఇంపుగా చెప్పే ఒక మంచి నీతి పద్యం చదివితే అదే చాలు అంటారు వేమనాచార్యులవారు. కానీ వేమన పద్యాలు వేలల్లో ఉన్నాయి. పేరుకి శతకం అన్నా వేలల్లో పద్యాలు లభ్యమౌతాయి.

అయితే, అవన్నీ వేమన రచించినవి కావు అని కొందరంటారు. ఎవరు రచిస్తే ఏమిటి అది బాగుండాలి, ఉపయోగపడాలి కానీ. ఆయనే రచించాడని పొగిడినా కాదన్నా ఎలాంటి తేడా రాని స్థితి వేమనది. ఆయన అసలు పేరు వేమనారెడ్డి, ఆతను మా కులం వాడు, మా ప్రాంతం వాడు, మా భాష వాడు, మా యోగుల్లో ఒకడు ఇలా ఎందరు ఎన్ని రకాలుగా అనుకున్నా, మానవులంతా ఉన్నంతకాలం గుర్తుండేలా పనికివచ్చేలా పద్యాలను రచించిన వేమన ఒక చాటు పద్యం చాలని అన్నా, ఎన్నో పద్యాలను మానవాళికి బహూకరించాడు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vemana satakam
 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 15 | తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 14 | పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 12 | చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని... Read more

  • Vemana satakam in telugu

    వేమన శతకము

    Apr 11 | చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం,... Read more

  • Vemana satakam

    వేమన శతకము

    Apr 08 | చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు... Read more