పిచ్చి ముదిరి పీక్ స్టేజ్ వెళ్లి పోతే ఇలాంటి పనులే చేస్తారని మన లవ్ బర్డ్స్ నిరూపించారు. ఈ ఇద్దరు బతికేతి .. తెర ప్రపంచంలోనే.. కానీ వీరి కంట్లో దూలం పెట్టుకొని, ఎదుటివారి కంట్లో ఉన్న నలుసు గురించి కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా.. టాలీవుడ్ ను మాయ చేసిన మాయలేడి సమంత, ఒకటి , రెండు సినిమాలో విజయం సాధించగానే కళ్లు నెత్తికెక్కిన ఫ్లప్ హీరో సిద్దార్థ. ఈ ఇద్దరు కలిసి టాలీవుడ్ ఫ్రిన్స్ మహేశ్ బాబు నటించిన 1-నేనొక్కడినే పోస్టర్ కామంట్ చేయటం జరిగింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ట్విట్ యుద్దం ప్రారంభించారు. అసలు విషయం ఏమిటంటే.. ఈమధ్యే..మహేశ్ నటించిన ‘1-నేనొక్కడినే' పోస్టర్ విడుదలైంది. అయితే..సదరు పోస్టర్‌లో ఆడవాళ్లను కించపరిచే విధంగా ఇమేజ్‌లు వున్నాయంటూ హీరోయిన్ సమంత తన ట్విట్టర్లో కామెంట్ చేయటం జరిగింది.
కానీ సినిమా పేరు మాత్రం ఆమె పేర్కొనలేదు. దీనిపై మహేష్ బాబు అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పైగా సమంత చేసిన కామెంట్స్‌ను హీరో సిద్ధార్ధ్ కూడా అభినందించాడట. అంతేగా మరి లవర్‌ను వెనకేసుకు రాకపోతే ఎలా. దీంతో మహేశ్ ప్యాన్స్ మరింత ఆగ్రహానికి లోనయ్యారు. సమంత, సిద్దార్థ గెట్ లాస్ట్ అంటూ వారిపై ట్వీట్ల వర్షం కురిపించారు. మీరిద్దరూ ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోవాలంటూ కామెంట్ చేసారు. సమంత చేసిన ట్వీట్ ఇలా వుంది... 'విడుదలకు సిద్ధమవుతున్న ఓ సినిమా పోస్టర్ ఈ మధ్య చూశాను.
ఆ పోస్టర్‌లో హీరో, హీరోయిన్స్‌ని చూస్తుంటే మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది' అంటూ పేర్కొంది. ‘1-నేనొక్కడినే' పోస్టర్ గురించే సమంత ఈ కామెంట్ చేసిందంటూ సోషల్ నెట్‌వర్క్‌లో దుమారం రేగుతోంది. మహేశ్...సమంత అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. సమంతను సపోర్ట్ చేస్తూ కొందరు... మహేష్ సినిమాను సపోర్ట్ చేస్తూ మరికొందరు ట్వీట్స్ చేసుకుంటున్నారు. సమంత నీ మొదటి సినిమాహీరో నాగ చైతన్యతో చేసిన సినిమాలో .. రైలు బండిలో రొమాన్స్ చేసిన విషయం మరిచిపోయావా? అయిన నీకు లిప్ లాక్ లేనిదే .. సినిమా లో నటించవనే కామెంట్ ఉన్న విషయం ఎలా మరిచిపోయావ్ అంటూ మహేష్ అభిమానులు అంటున్నారు. అయిన మహిళల మీద ఇంతకంటే.. దారుణమైన పోస్టర్లు , సినిమాలు వస్తున్నాయి .. వాటి మీద పైట్ ఎందుకు చేయలేదే అని మహేష్ అభిమానులు అడుగుతున్నారు. కేవలం సమంతకు కుళ్లు పుట్టే ఇలా కామెంట్ చేసినట్లు సమాచారం.
గతంలో సమంత మహేష్ బాబు తో రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు నిర్మాతలకు కాసులు వర్షం కురిపించాయి. ఈ సినిమాలో సమంతను తీసుకోనందుకే .. ఇలాంటి కామెంట్స్ చేస్తుందని మహేష్ బాబు అభిమానులు అంటున్నారు. ఏమైన .. సమంత తెలివిని మెచ్చుకోవాలని కొందరు అంటున్నారు. సమంత ప్రీగా వచ్చే పబ్లిసిటి కోసం ఇలా చేసి ఉంటుందని .. ఆమె అభిమానులు వెనకేసుకొస్తున్నారు. సమంత చేసిన కామెంట్ పై ప్రిన్స్ మహేశ్ ఏమంటారో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more