ఢిల్లీ రాజకీయం రోజుకోక మలుపు తిరుగుతుంది. ఢిల్లీ రాజకీయలను పూర్తిగా మార్చిన ఘనత ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకే దక్కింది. ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద కోపం వస్తే, బీజేపి ఓటేసేవారు. అదే బీజేపి పార్టీ మీద కోపం వస్తే.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ కే పట్టం కట్టేవారు. ఇలా మార్చి మార్చి ఢిల్లీ ప్రజలు రెండు రాజకీయ పార్టీలు పెట్టే కష్టాలను అనుభవిస్తున్నారు. అయితే ఈ సారీ మాత్రం అలా కాదు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపి లకు ఢిల్లీ ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు.
ఆ రెండు పార్టీలను కాదని ..ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. కానీ ఏఏపీ గెలుపు అంచువరకు వెళ్లి ఆగిపోయింది. ఏఏపీతో కాంగ్రెస్ పార్టీ, బీజేపి నాయకులకు దిమ్మతిరిగిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవటానికి ఏం లేదు. ఇక బీజేపి అయితే అధికారానికి అరంగుళం దూరం ఉంది. దీంతో బీజేపి పరిస్థితి బలం కోసం ఎదురుచూపులు చూస్తుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం దూరంగా ఉంటుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయని అంటున్నారు.
అవినీతిని ఎన్నికల్లో ప్రధాన అంశంగా మార్చిన ఘనత ఆమ్ ఆద్మీ పార్టీదే. నిష్కళంక, భాగస్వామ్య పరిపాలన హామీతో ఢిల్లి శాసనసభ ఎన్నికల్లో పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 70 స్థానాల్లో 28 స్థానాలను ఓటర్లు కట్టబెట్టి గుండెలకు హత్తుకున్నారు. అయితే, అధికార పీఠాన్ని అధి రోహించేందుకు మాత్రం ఆ పార్టీ ముందడుగు వేయలకపోతోంది. బీజేపీ 32 స్థానాల్లో గెలిచింది. ఏఏపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజారిటీ లేకపోవడంతో ఇరు పార్టీలు వెనుకడుగు వేస్తు న్నాయి. ఏఏపీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ తాము ఎవరికీ మద్దతివ్వ బోమని, తాము ఎవ్వరి మద్దతూ తీసుకోబోమని స్పష్టం చేశారు. అతి పెద్ద పార్టీగా బీజేపీకి ప్రజలు మద్దతునిచ్చారని తెలిపారు.
మరోసారి ఎన్నికలకు తాము సిద్ధమని పేర్కొన్నారు. తమపై ప్రజల్లో ప్రత్యర్థి పార్టీల తో అంటకాగుతున్న భావన కలుగకూడదని ఏఏపీ కోరు కుంటోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే విమర్శకుల అభిప్రా యం వేరుగా ఉంది. ఏఏపీ ఎమ్మెల్యేల్లో చాలామంది 35 ఏళ్లకన్నా తక్కువ వయసువారేనని, ప్రభుత్వాన్ని నడిపేందుకు స్పష్టమైన విధానంగానీ, దూర దృష్టిగానీ ఏఏపీకి లేదని అంటున్నారు.
మంత్రులుగా నియమించేందుకు కనీసం ఏడుగురు బలమైన అభ్యర్థులు అవసరమంటున్నారు. 1993లో బీజేపీ ప్రభుత్వంలో యువతతో పాటు అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురా నాకు అనేక సంవత్సరాలు నగర పాలక సంస్థ, మెట్రోపాలిటన్ కౌన్సిల్‌లలో పదవులతో పాటు చీఫ్ విప్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్, ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉంది. అప్పటి ఆర్థిక మంత్రి జగదీశ్ ముఖి మెట్రోపాలిటన్ కౌన్సిలర్‌గా పని చేశారు. రవాణా మంత్రి రాజేంద్ర గుప్తా ఢిల్లీ మేయర్‌గా పని చేశారు. ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ ఫిజిషియన్, జాతీయ, అంతర్జాతీయ స్థాయులలో అనుభవం ఉంది. 1998లో కాంగ్రెస్ ప్రభుత్వం పరి స్థితి కూడా అదే. ముఖ్య మంత్రి షీలా దీక్షిత్ 1986 నుంచి 1989 వరకు కేంద్ర కేబినెట్‌లో పని చశారు.
ఆర్థిక మంత్రి మహేందర్ సింగ్ సతి ఢిల్లీ మేయర్‌గా అనుభవం గడించారు. విద్యా మంత్రి నరేంద్ర నాథ్ నగర పాలక సర్థలో ప్రతిపక్ష నేత. పర్వేజ్ హష్మి , అశోక్ వాలియా, కృష్ణ తీర్థ్ రెండొ సారి ఎమ్మెల్యేలు. ఈ విమర్శలపై కేజ్రీవాల్ స్పందిస్తూ తమకు 36 స్థానాలు వచ్చి ఉంటే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేవారమని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more