సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు జగన్ వ్యూహరచన చేస్తున్నారు..వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా టీడీపితోనే గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోని బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా చంద్రబాబుకు చెక్‌పెట్టాలనే యోచనతో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్య ఉద్యమానికి సీమాంధ్ర నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తున్నారు.. వైఎస్‌తో సాన్నిహిత్యం ఉన్న అధికార పార్టీ నేతలు ఓ అడుగు ముందుకేసి పార్టీలో చేరుతుండగా టీడీపి శ్రేణులు వేచిచూసే ధోరణితో తెరచాటు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన విషయంలో టీడీపి అనుసరిస్తున్న వైఖరిని ఆ పార్టీ సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి విదితమే.
తొలుత విభజనకు అనుకూలంగా స్పందించిన పార్టీ అధినేత సీమాంధ్ర ఉద్యమంతో సమన్యాయం సూత్రాన్ని అనుసరిస్తున్నారని, అయితే తమ గెలుపు ఓటమిలపై పార్టీ విధానం ప్రభావం చూపుతుందనే భయాందోళన కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకుంటున్నారు. వైకాపాలో చేరితే తమ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందనే ముందస్తు సర్వేలు నిర్వహిస్తున్నారు. సానుకూల ఫలితాలు ఉన్న ప్రాంతాల నాయకులు జగన్‌తో మంతనాలు జరుపుతున్నారు. గత రెండు విడతలుగా జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో శాసనసభ స్థానాన్ని ఆశించి భంగపడిన వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు వైకాపాలో చేరేందుకు మంతనాలు జరు పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీ స్థానాన్ని ఆయన ఆశిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరుపున ప్రచారం నిర్వహిస్తారనే ఊహాగానాలు వైకాపా శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. గుంటూరు ఎంపీ స్థానానికి ఇప్పటికే బాలశౌరి అభ్యర్ధిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. ఈ పరిస్థితుల్లో నరసరావుపేట నుంచి నార్నె పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మామ తరుపున జూనియర్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తారని చెప్తున్నారు. జూనియర్‌కు అత్యంత సన్నిహితులైన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వైకాపాలో కొనసాగుతున్నారు. టీడీపిలో నందమూరి- నారా వంశస్థుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబును వ్యతిరేకిస్తున్న నేతలు తమ ప్రచారంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌తో పాటు వైఎస్సార్ చిత్రాన్ని జతపరుస్తున్నారు.
టీడీపి రాజకీయాలు జీర్ణించుకున్న ఎన్టీఆర్ వైకాపా తరుపున ప్రచారంచేసే అవకాశంలేదని విశ్లేషకులు భావిస్తున్నా మామకు సీటిస్తే పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. గత సార్వత్రిక ఎన్నికల వరకు జూనియర్ టీడీపి తరుపున విస్తృత ప్రచారం చేశారు. కుటుంబ స్పర్ధల నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉంటు న్న ఎన్టీఆర్ గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంగా పర్యటించలేదు. అయితే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నందున తాను ప్రచారం నిర్వహించలేక పోయానని, తాను పార్టీ ప్రతిష్టనే కోరుకుంటానని స్పష్టం చేశారు.
రాష్ట్ర రాజకీయాలను ఆకళింపు చేసుకుని ప్రత్యర్ధి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించటంతో పాటు ఎన్టీఆర్ తరహాలో ప్రచారం నిర్వహించే జూనియర్‌కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. మంచి స్పీకర్‌గా పార్టీలో గుర్తింపు పొందారు. అయితే చంద్రబాబు రాజకీయ వారసునిగా లోకేష్ ఎదుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ముఖ్యం గా హరికృష్ణ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాచేసిన మొదటి రాజ్యసభ సభ్యునిగా ఆయన ప్రతిష్టను నిలుపుకున్నారు. మహానాడు, పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో సైతం ఆయన అధిష్టానం వైఖరిని తప్పుపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో జూనియర్ సైతం పార్టీకి దూరమయ్యారు. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి టీడీపి అభ్యర్ధిగా పోటీచేసిన వల్లభనేని వంశీ తదితరులు వైకాపాలో చేరేందుకు రంగం సిద్ధమైందని చెప్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more