Cm kiran not floating new party sailajanath

CM Kiran not floating new party Sailajanath, Chief Minister N Kiran Kumar Reddy, Kiran may launch new party in December, S Sailajanath, AP Congress Party

CM Kiran not floating new party Sailajanath

సమైక్యాంధ్ర సింహం కొత్త పార్టీ నాకు తెలియదు?

Posted: 10/29/2013 07:25 PM IST
Cm kiran not floating new party sailajanath

ఇప్పుడు సీమాంద్రలో సమైక్యాంద్ర సింహం పేరుతో కొత్త పార్టీ వస్తుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ సమైక్యాంద్ర సింహాలు ఎవరు అనేది మాత్రం తెలియటం లేదు. దీనిపై మంత్రి శైలజానాథ్ మాత్రం తనకు తెలియదని అంటున్నారు. కొత్త పార్టీ గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమతో ప్రస్తావించలేదని మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ప్రజలు సంక్షేమంగా ఉంటారని ముఖ్యమంత్రి భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. విభజనను అడ్డుకునేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, కోర్టుల ద్వారా విభజనను అడ్డుకుంటామన్నారు. ఎన్నికల ముందు పొలిటికల్ సర్వేలు సహజమేనని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సర్వేలే ప్రాతిపదికగా చెప్పలేమన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని శైలజానాథ్ తెలిపారు.

 

కాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో... విభజనకు పూర్తిగా సహకరించి, అంతా అయిపోయాక, చివరికి ‘సమైక్య సింహం’ ముసుగులో కొత్త పార్టీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే నేతృత్వం వహిస్తారని సమాచారం. ఇందుకు సంబంధించి పార్టీ నేతలందరితో ఆయన ఇప్పటికే అంతర్గతంగా చర్చలు సాగిస్తున్నారు. కొత్త పార్టీకి అవసరమైన ప్రచార సామగ్రిని కూడా సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

సమైక్యాంధ్ర సింహం పేరుతో ముఖ్యమంత్రి తన బొమ్మతో పలు కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయిస్తున్నారు. అయితే విభజన ప్రక్రియకు రాష్ట్ర స్థాయి నుంచి ఎలాంటి ఆటంకాలూ లేకుండా మొత్తం వ్యవహారం నడిపించిన తర్వాతే సమైక్యాంధ్ర ఎజెండాగా కొత్త పార్టీ తెరమీదకొచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

అయితే ఈ సమైక్యాంద్ర సింహం పార్టీ వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే కొంతమంది సీమాంద్ర రాజకీయ నాయకులు మాత్రం ఆనందంగా ఉన్నట్లు సమాచారం. ఏమైన తెరపైకి కొత్త పార్టీ వచ్చేదాక ఇలాంటి వార్తల పై నమ్మకంలేదని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more