Pawan kalyan morphed pic in tdp outfit

Power star in telugu desam, pawan kalyan in TDP, pawan kalyan politics entry, pawan kalyan chandrababu , Pawan Kalyan

Powerstar Pawan Kalyan is joining Telugudesam party in the coming days, it seems like some fans have made a design showcasing how the star-hero looks in TDP attire.

టీడీపీ కండువాలో పవన్... పార్టీలో చేరుతాడా ?

Posted: 10/21/2013 11:30 AM IST
Pawan kalyan morphed pic in tdp outfit

సినీ తారలు సినీ కెరియర్ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ గా రాజకీయాలను ఎంచుకోవడం సర్వసాధారణం అయిపోయింది. సినీ కెరియర్ ఊపులో ఉండగానో, పీక్ స్టేజికి వచ్చాకనో ఏదో పార్టీలో చేరిపోవడం లేదంటే రాజకీయ పార్టీ పెట్టడం ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మంది మన తెలుగు హీరోలు రాజకీయాల్లో ఉండగా ఇఫ్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ మాత్రం పవన్ కళ్యాణ్ గురించే. గత కొంత కాలం నుండి ఈయన రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

గతంలో తన అన్న పార్టీ పీఆర్పీలో ఉండి, ఆ పార్టీ విలీనం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న పవన్ బీజేపీలోకి గానీ, టీడీపీ పార్టీలో గానీ చేరబోతున్నాడని, దానికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని ఇలా వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎప్పుడో గానీ మీడియా మందు కనిపించని పవన్ ఈ వార్తల పై ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ ఇటీవలే ‘అత్తారింటికి దారేది ’ సినిమా ‘ధ్యాంక్స్ మీట్ ’ లో సమాజం మీద, ఈ దేశం పై ఉన్న ప్రత్యేకమైన శ్రద్దను తన మాటల ద్వారా వినిపించాడు. దాని తరువాత రాజకీయల్లోకి వస్తున్నాడనే వార్తలకు మరింత బలం చేకూరింది.

వాటి సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుతం అంతర్జాలం (ఇంటర్ నెట్ ) లో పవన్ కళ్యాణ్ టీడీపీ నేత గెటప్‌లో ఓ ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. టిడిపి ‘కండువా ’ కప్పుకున్న ఈ  ఫోటో  ఎవరో ఔత్సాహిక కార్యకర్తలు టాలెంట్ ని ఉపయోగించి మార్పింగ్ చేసిందే అయినా, ఈ ఫోటో కాస్త టీడీపీ శ్రేణుల్ని కలవరానికి గురి చేస్తుంది. మొన్నా మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీల పై జూనియర్ ఎన్టీఆర్ బొమ్మ, మహేష్ బొమ్మ వేసి హల్ చేసిన విషయం తెలిసిందే.

ఇలా ఆ పార్టీకి బాగా పాపులారిటీ రావడమే కాకుండా టీడీపీని దెబ్బకొట్టడానికి ఆడిన చిన్న మైండ్ గేమ్ బాగా వర్కవుట్ కావడంతో ఇప్పుడు అలాంటి ట్రిక్స్ నే ఇక్కడ ప్లే చేస్తున్నారేమో అని అంటున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక బాలయ్యకు చిరుకు మాటల యుద్దం జరిగింది. సందులో సందుగా టీడీపీ వారు పవన్ పై కూడా వ్యాఖ్యలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటిది పవన్ టీడీపీలో చేరుతారా అనేది డౌట్.

ఒక వేళ వచ్చినా తెలుగు తమ్ముళ్ళు పవన్ ని ఆహ్వానిస్తారా ? అని కొంత మంది అంటుంటే... మరి కొంత మంది టీడీపీ శ్రేణులు పార్టీకి పవన్ లాంటి సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి అయితే ప్లస్ అవుతుందని, దాని ద్వారా ఓటు బ్యాంకును కొల్లగొట్టవచ్చనే అభిప్రాయాన్ని వక్తం చేస్తున్నారు. పవన్ టీడీపీలో చేరుతాడా ? అన్నయ్యను ఎదిరించి కొత్త పార్టీ పెడతాడా ? అన్నది ముందు ముందు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more