తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపి, దానికి సంబంధించిన ప్రక్రియను కూడా తాను అనుకున్న టైంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిన్న కేంద్ర కేటినెట్ మీట్ లో తెలంగాణ నోట్ పై చర్చించి, దానికి ఆమోద ముద్ర వేయడంతో ఇక రాష్ట్ర విభజన లాంఛనమే అయిపోయింది. దీంతో సీమాంధ్రలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రక్క సీమాంధ్ర ఉద్యోగులు గత అరవై రోజుల నుండి ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలోకి రాజకీయ నాయకుల్ని రానీయకపోవడంతో రాజకీయ ఉనికి కోసం నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. విజభన పై నిర్ణయం వెలువడిన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు, నేతలు రాజీనామాలు చేశారు. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రార్టీలు అయిన తెలుగు దేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా తమ వంతుగా రాజీనామాలు సమర్పిస్తూనే ఉన్నారు.
ఇక ఆ పార్టీల అధినేతలు మాత్రం ‘చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ’ నిరహార దీక్షలు చేయడానికి సిద్ధం అయ్యారు. రేపటి నుండి వైకాపా అధ్యక్షుడు జగన్ హైదరాబాద్ లో ‘ఆమరణ ’ దీక్షకు దిగుతుంటే... వైకాపాను తలదన్నేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేసే ఆలోచనలో ఉన్నట్లు మీడియా వర్గాల సమాచారం. ఎందుకంటే సమస్య అక్కడి నుంచే వచ్చింది కాబట్టి, ఢిల్లీలోనే దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. సమస్య జాతీయస్థాయిలో తెలియాలని, ఈరోజు నాలుగు గంటలకు మరోసారి సీమాంధ్ర నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం ఏడు గంటలకు దీక్షపై ఆయన అధికారికంగా మీడియా సమావేశంలో ప్రకటన చేయనున్నారు. దీక్ష ఎప్పుడు చేపట్టేది, విధివిధానాలు తెలియజేయనున్నారు. మొన్నటి వరకు జైల్లో నాలుగు గోడల మధ్య గడిపి వచ్చిన ఈయన సమైక్యవాదిగా ముద్ర వేసుకోవడమే కాకుండా, సీమాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తిగా నిలిచిపోవడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు.
నిన్న విభజన నిర్ణయం వచ్చిన తరువాత మీడియా సమావేశం నిర్వహించి కేంద్రం పై, చంద్రబాబు, కిరణ్ లను టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఈయన ఆ పార్టీ తరుపునుండి 72 గంటలు బంద్ కు పిలుపునిచ్చిన ఈయన నేడు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన రేపటి నుండి తన పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. నేడు తన నివాసం లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర విభజన జరిగిందని, కేంద్రం మీ చావు మీరు చావండి అన్న రీతిలో వ్యవహరించిందని అన్నారు. ఆ నిర్ణయానికి నిరసనగానే దీక్షకు దిగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని చూస్తుంటే పండగ సీజన్ కాకుండా దీక్షల సీజన్ లాగా అనిపిస్తుందని అంటున్నారు. ఇన్ని రోజులు సైలెంటుగా ఉన్న ఈ అధినేతలు ఇప్పుడు ఒకరు రాష్ట్రంలో, మరొకరు ఢిల్లీలో దీక్షలు చేసినంత మాత్రానా జరిగిన నిర్ణయం వెనక్కి వస్తుందా ?
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more